NTV Telugu Site icon

Supreme Court: పరస్పర అంగీకారంతో.. లైంగిక సంబంధం నేరం కాదు..

Supreme Court

Supreme Court

ప్రేమ సంబంధాలలో ఇద్దరి(ప్రియుడు, ప్రియురాలు)పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. అంగీకారంతో శారీరక సంబంధానికి సంబంధించిన అత్యాచారం కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇద్దరి అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత అత్యాచారం కేసు నమోదు చేయరాదని పేర్కొంది. ఇలాంటి కేసులపై ఎస్సీ ఆందోళన వ్యక్తం చేసింది.

READ MORE: Payyavula Keshav: అనంతపురం జిల్లా ప్రజల రుణం తీర్చుకునేలా నిర్ణయాలు తీసుకున్నాం!

ముంబైలోని ఖర్ఘర్ పోలీస్ స్టేషన్‌లో మహేశ్ దాము ఖరేపై వనితా ఎస్ జాదవ్ దాఖలు చేసిన ఏడేళ్ల ఎఫ్‌ఐఆర్‌పై తీర్పు వెలువడింది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇద్దరి అంగీకారంతో చాలా కాలం పాటు లైగిక సంబంధం పెట్టుకుని.. వివాదాలు తలెత్తినప్పుడు దానిని అత్యాచారంగా పేర్కొనడం ఆందోళనకర ధోరణి అని అన్నారు. ఇలాంటి కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి శారీరక సంబంధాలు కొనసాగించిన తర్వాత ఇలా కేసులు పెట్టుకోవడం సరైన పద్దతి కాదన్నారు.

READ MORE:IPL 2025-RCB: ఐపీఎల్ ప్రారంభం కాకముందే వివాదాల్లో చిక్కుకున్న ఆర్‌సీబీ..

కేసు వివరాల ప్రకారం.. వివాహితుడైన ఖరే, వితంతువు అయిన వనితా ఎస్ జాదవ్ మధ్య 2008లో శారీరక సంబంధాలు మొదలయ్యాయి. కొన్ని రోజుల తర్వాత వారిద్దరూ విడిపోయారు. తన ప్రేమికుడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడని జాదవ్ ఆరోపించింది. ఈ మేరకు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తాజాగా ఈ అంశంపై కోర్టు తన తీర్పును వెలువరించింది.