Supreme Court: జనాభా నియంత్రణపై జోక్యం చేసుకోలేం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు ఇద్దరు పిల్లల నిబంధనను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ నిరాకరించింది. జననాల సంఖ్య పెరిగినప్పటికీ భారతదేశ జనాభా స్థిరంగా ఉందని, కోర్టు జోక్యం చేసుకోవాల్సిన సమస్య కాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీనిపై ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని కోర్టు వెల్లడించింది. ఈ అంశంపై లా కమిషన్ నివేదిక చాలా ముఖ్యమైనదని పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ అన్నారు ” ఇది సామాజిక సమస్య. దీనిపై లా కమిషన్ ఏమని నివేదిక ఇవ్వగలదు?” అని న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Special Story on Marriages: రోజులు 31. పెళ్లిళ్లు 32 లక్షలు. ఖర్చు 3.75 లక్షల కోట్లు
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు ఇద్దరు పిల్లల నిబంధనతో సహా కొన్ని చర్యలను కోరుతూ చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. దేశంలో జనాభా నియంత్రణకు సమర్థ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని అశ్వినికుమార్ ఉపాధ్యాయ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించడానికి ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు చెప్పడంతో ఆయన దానిని ఉపసంహరించుకున్నారు. ఆయన అభ్యర్థనతో పాటు, ఈ సమస్యపై దాఖలైన మరికొన్ని పిటిషన్లను కూడా ధర్మాసనం తిరస్కరించింది. వాటిని ఉపసంహరించుకోవాలని న్యాయవాదులను ప్రేరేపించింది. ఈ విషయంపై కోర్టుకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. జనాభా నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నామని కోర్టుకు నివేదించింది.
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!