40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని సుప్రీం ఆదేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 40 అంతస్తులు కట్టేశారు. వందల కోట్లు ధార పోశారు. చివరకు అది అక్రమమని తేలడంతో.. భవనాన్ని కూల్చివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీం ఆదేశాలతో దాన్ని నేలమట్టం చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన దేశ అత్యున్నత న్యాయ స్థానం.. ప్లాట్ ఓనర్లకు 12శాతం ఇంట్రెస్ట్‌తో డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఎమరాల్డ్ కోర్టు ప్రాజెక్టులో భాగంగా ఈ ట్విన్ టవర్స్‌ను సూపర్ టెక్ సంస్థ నిర్మించింది. ఇందులో 900లకు పైగా ప్లాట్స్ ఉన్నాయి.
నిబంధనలు ఉల్లంఘించి భవన నిర్మాణం జరిగిందంటూ 2014లోనే అలహాబాద్ హైకోర్టు నిర్ధారించింది. దీనిపై సూపర్ టెక్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా చుక్కెదురైంది. నోయిడా అథారిటీ అధికారులు, సూపర్ టెక్ ప్రతినిథులతో కుమ్మక్కయ్యారని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. మూడు నెలల్లోగా కూల్చివేతలు పూర్తి చేయాలని.. దీనికి అయ్యే ఖర్చును సూపర్ టెక్ భరించాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో దాన్ని కూలగొట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏం చేయాలో తెలియక దాని యాజమాన్యం తలపట్టుకుంటోంది.
Also Read
- Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. వార్తల్లో నిలిచేందుకు రాహుల్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ!
- World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
- Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
- AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
- Tags
- Supreme Court
- twin towres
తాజావార్తలు
-
Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. వార్తల్లో నిలిచేందుకు రాహుల్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ!
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!