NTV Telugu Site icon

Supreme Court: ఏపీ సర్కార్‌కు ఊరట.. సిట్‌పై హైకోర్టు స్టే కొట్టివేత..

Supreme Court

Supreme Court

Supreme Court: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన “సిట్” పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.. గత ప్రభుత్వ అవినీతిపై ‘సిట్’ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటుపై ‘స్టే’ విధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.. హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్‌ చేయగా.. ఇప్పటికే వాదనలు విన్న జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ రోజు తీర్పు ఇచ్చింది.. ఈ సందర్భంగా హైకోర్టు తప్పుగా అన్వయించుకుందని వ్యాఖ్యానించింది ధర్మాసనం.

Read Also: The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమాపై తమిళనాడు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ తీవ్ర హెచ్చరిక

కాగా, చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.. ఈ క్రమంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. అయితే.. “సిట్” ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు. అయితే, ఆ పిటిషన్‌పై విచారణ జరిపి హైకోర్టు.. సిట్‌ ఏర్పాటుపై స్టే విధించింది.. ఇక, సిట్ ఏర్పాటుపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం… ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపి ఈ రోజు తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు… ఈ సందర్భంగా హైకోర్టు తీర్పును, తీరును తప్పుబడుతూ వ్యాఖ్యలు చేసింది జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదని.. సీబీఐ , ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని పేర్కొంది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని, జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదని సుప్రీం బెంచ్‌ ప్రస్తావించింది. ఇక, ఏపీ హైకోర్టును తీర్పును పక్కనపెడుతున్నట్లు జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

Show comments