Site icon NTV Telugu

Supreme Court : డ్రైవర్ల పనిగంటలపై ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court

Supreme Court

ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతన్నాయి. ఈ ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో పని గంటలు కూడా ఓ కారణం. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్లు అలసిపోతుంటారు. నిద్రలోకి జరుకోవడం, తీవ్ర నీరసం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డ్రైవర్లకు పనిగంటల విధానం అమలుపై రాష్ట్రాలు, కేంద్ర
పాలిత ప్రాంతాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు సూచించింది.

READ MORE: NCL Recruitment 2025: 10th, ఐటీఐ పాసైతే చాలు.. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో టెక్నీషియన్ జాబ్స్ మీవే

ప్రమాదంలో గాయపడిన వారికి సత్వరమే చికిత్స అందించేందుకు వీలుగా మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇందుకోసం ఆరు నెలల గడువును విధించింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్​తో కూడిని ద్విసభ్య ధర్మాసనం చెప్పింది. “దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో గాయపడినవారిలో చాలా మందికి సత్వరం చికిత్స అందడం లేదు. ఇంకా కొన్ని ఘటనల్లో గాయపడకపోయినా వాహనాల్లోనే చిక్కుకుపోతున్నారు. అందుకే వీరిని వేగంగా సాయం అందించే విధంగా ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నిబంధనలు రూపొందించాలి.” అని సుప్రీంకోర్టు పేర్కొంది.

READ MORE: Jagdeep Dhankhar: “రాష్ట్రపతికే ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదు”.. సుప్రీం తీర్పుపై ఉపరాష్ట్రపతి విమర్శ!

Exit mobile version