NTV Telugu Site icon

Supreme Court: పెద్ద ఎత్తన చెట్లు నరికి వేత.. ఒక్కో చెట్టుకు రూ.లక్ష జరిమానా!

Supreme Court

Supreme Court

ఉత్తరప్రదేశ్‌లోని తాజ్ ట్రాపెజియం జోన్‌లో అక్రమంగా చెట్ల నరికివేత అంశంపై సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించింది. నరికివేయబడిన ప్రతి చెట్టుకు ఒక వ్యాపారవేత్తకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ వ్యాపారవేత్త మొత్తం 454 చెట్లను నరికివేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీని ప్రకారం.. అతను మొత్తం రూ.4 కోట్ల 54 లక్షలను జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ” చెట్లు నరికి వేయడం ఒకరిని హత్య చేయడం కంటే దారుణం” అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించే వారి పట్ల దయ చూపడానికి వీళ్లేదని స్పష్టం చేసింది.

READ MORE: AP High Court: భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

“అనుమతి లేకుండా 454 చెట్లను నరికివేయడం ఖండించదగినది. ఈ పచ్చని ప్రాంతాన్ని తిరిగి సృష్టించడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుంది.” అని జస్టిస్ అభయ్.ఎస్. ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC) నివేదిక ప్రకారం.. గత సంవత్సరం సెప్టెంబర్ 18 రాత్రి, బృందావన్ చటికారా రోడ్డులోని దాల్మియా ఫామ్ అనే ప్రైవేట్ భూమిలోని 422 చెట్లను, ప్రక్కనే రోడ్డు వెంట ఉన్న రక్షిత అటవీ ప్రాంతంలో 32 చెట్లను అక్రమంగా నరికివేశారు. ఈ మేరకు ఒక్కో చెట్టుకు రూ.లక్ష జరిమానా విధించింది. కంపెనీ యజమాని శివ శంకర్ అగర్వాల్ జరిమానా మొత్తాన్ని తగ్గించాలని కోర్టులో వాదించారు. నేను తప్పును అంగీకరించి క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఒకే దగ్గర కాకుండా సమీప ప్రాంతంలో మొక్కలు నాటడానికి అనుమతించాలని కోరారు. అతడి వాదనలు విన్న కోర్టు జరిమానాను తగ్గించడానికి నిరాకరించింది. కానీ సమీప ప్రాంతంలో చెట్లను నాటడానికి అనుమతించింది.

READ MORE: Murders: మూడు దారుణ హత్యలు.. లవర్స్ కోసం భర్తలను చంపిన కిల్లర్ భార్యలు..