Supreme Court: నేడు సుప్రీంకోర్టులో పిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. తెలంగాణ స్పీకర్‌పై బీఆర్ఎస్ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అన్ని కేసులను నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని జూలై 31 న ఆదేశాలిచ్చింది దేశ అత్యున్నత ధర్మాసనం.. ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ ప్రారంభించారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుందని, మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టులో స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. మూడు నెలల గడువులోపే అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
READ MORE: Mega Hero Wedding Update: తన మ్యారేజ్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి దుర్గ తేజ్..
మరోవైపు.. తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. సుప్రీం కోర్టు 3 నెలల్లో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది వాదించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ విచారించారు. విచారణకు మరింత సమయం కావాలని కోర్టును కోరుతున్నారు.