Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Supreme Court Hearing On Chandrababu Special Leave Petition Today

Chandrababu Arrest: చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Published Date :September 27, 2023 , 7:36 am
By Sudhakar Ravula
Chandrababu Arrest: చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ ఇవాళ విచారణకు రానుంది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా దాఖలు చేసిన మెన్షన్‌ మెమోపై సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఎల్పీపై బుధవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా.. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో తనపై కేసు నమోదు చేశారని చంద్రబాబు తెలిపారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. ఆయన తరపు లాయర్లు రు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌.. న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి ఎస్వీఎన్ భట్‌ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. కేసు సంఖ్య నంబర్ 61గా పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానానికి చంద్రబాబు మూడు విన్నపాలు చేశారు. వాటిలో ఒకటి… తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ను కొట్టేయాలని, రెండోది జ్యుడీషియల్‌ రిమాండ్‌ను సస్పెండ్‌ చేయాలని, మూడోది.. తనపై విచారణను పూర్తిగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. ఇప్పటికే చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీనిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ఇవాళ విచారణకు రానుండటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ ఇవ్వాలంటూ.. చంద్రబాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. నేడు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు వాదనలు జరగనున్నాయి. రాజధాని నగరానికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాని అనుసంధానించే రహదారుల అలైన్‌మెంట్‌లో.. అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. చంద్రబాబును మొదటి నిందితుడిగా చేర్చడంతో.. బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్ వాదనలు వినిపించారు. సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదించారు. మరోవైపు, చిత్తూరు జిల్లా అంగళ్లు ఘటనలో బెయిల్ మంజూరు చేయాలంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన సమయంలో.. అంగళ్లు వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వ్యవహారంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులో చాలా మందికి బెయిల్ మంజూరైందని.. చంద్రబాబు కూడా బెయిల్ ఇవ్వాలని కోరారు ఆయన తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Also Read

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేరును చేర్చింది సీఐడీ. కేసులో లోకేష్‌ పేరును చేరుస్తూ.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ని చేర్చింది సీఐడీ. హెరిటేజ్‌ ప్రైవేట్ సంస్థలో ఈడీగా నారా బ్రాహ్మణి, వైఎస్‌ ఛైర్మన్‌ అండ్ ఎండీగా నారా భువనేశ్వరి ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ కుటుంబానికి హెరిటేజ్ లో 50శాతానికి పైగా షేర్లు ఉన్నాయి. మంత్రి హోదాలో లోకేష్ హెరిటేజ్ సంస్థకు ప్రయోజనం చేకూరే విధంగా కుట్ర పన్నారని సీఐడీ పేర్కొంది. రాజధాని రావటానికి ముందే వేరే వ్యక్తులతో తుళ్లూరు, మందడం వంటి ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేశారని తెలిపింది. తర్వాత ఆ వ్యక్తుల నుంచి హెరిటేజ్ సంస్థ..తక్కువ ధరకు స్థలాలు కొనుగోలు చేసిందని.. 2017లో ఇన్నర్ రింగ్ రోడ్డులో స్థలాలు పోకుండా, వాటి విలువ పెరిగేలా లోకేశ్ కుట్ర చేశాడని స్పష్టం చేసింది. చంద్రబాబును ప్రభావితం చేసి.. లోకేష్ తన కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న హెరిటేజ్ సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేలా కుట్ర చేసినట్టు పేర్కొంది సీఐడీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • Chandrababu Arrest
  • Chandrababu Special Leave Petition
  • Delhi
  • high court

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions