NTV Telugu Site icon

Supreme Court: ట్రిపుల్ తలక్‌కు వ్యతిరేకంగా ఎన్ని కేసులు నమోదయ్యాయి? రిపోర్టు ఇవ్వండి..

Supremecourt

Supremecourt

గత ఆరేళ్లలో ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు దాఖలు చేసిన కేసుల వివరాలను సుప్రీంకోర్టు బుధవారం (జనవరి 29) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019లో ఆమోదించిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టాన్ని ఉల్లంఘించి, ట్రిపుల్ తలాక్ చెప్పి ఎంత మంది ముస్లిం పురుషులు తమ భార్యలకు విడాకులు ఇచ్చారో స్పష్టత ఇవ్వాలని కోరింది. దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జిషీట్లు వివరాలు తెలిపాలని పేర్కొంది. ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సమాచారం కూడా ఇవ్వాలని అత్యున్నత ధర్మాసనం తెలిపింది.

READ MORE: Minister Kolusu Parthasarathy: వైసీపీ ఖాళీ అవుతోంది.. నంబర్‌ 2లు కూడా వెళ్లిపోయారు.

ఈ చట్టం యొక్క రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 12 పిటిషన్‌లను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. కోజికోడ్‌కు చెందిన ముస్లిం సంస్థ ‘సమస్తా కేరళ జమియత్ ఉల్ ఉలేమా’ ఈ కేసులో ప్రధాన పిటిషనర్‌గా ఉంది. ఈ పిటిషన్లపై తమ వ్రాతపూర్వక ప్రాతినిధ్యాలను దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఇతర పక్షాలను కూడా కోరింది. మూడు పేజీలకు మించకుండా తమ వాదనలకు మద్దతుగా వ్రాతపూర్వక ప్రాతినిధ్యాలను కూడా దాఖలు చేయాలని స్పష్టం చేసింది. పిటిషనర్లు ట్రిపుల్ తలాక్ ఆచరణను నేరంగా పరిగణించడాన్ని మాత్రమే సవాలు చేస్తున్నారని సుప్రీం తెలిపింది. కానీ.. ట్రిపుల్ తలాక్ పద్ధతిని సమర్థించడం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది.

READ MORE: Vikram : 7 ఏళ్ల తర్వాత రిలీజ్ కాబోతున్న స్టార్ హీరో సినిమా