Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Supreme Court Gave Important Directions In The Gnanavapi Case Survey Should Be Done In A Non Invasive Technique

Supreme Court: జ్ఞానవాపి కేసులో సుప్రీం కీలక ఆదేశాలు.. సర్వే నాన్‌-ఇన్వేసివ్‌ టెక్నిక్‌లో చేయాలని షరతు

Published Date :August 4, 2023 , 6:11 pm
By Rajesh Veeramalla
Supreme Court: జ్ఞానవాపి కేసులో సుప్రీం కీలక ఆదేశాలు.. సర్వే నాన్‌-ఇన్వేసివ్‌ టెక్నిక్‌లో చేయాలని షరతు
  • Follow Us :
  • google news
  • dailyhunt

జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) కీలక ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు శాస్త్రీయ సర్వేను ఆపాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను నిరాకరిచిన సుప్రీం.. సర్వేను ‘నాన్‌-ఇన్వేసివ్‌ టెక్నిక్‌’లో కొనసాగించాలని పురావస్తు శాఖ అధికారులను ఆదేశించింది. ఇంతకు ముందు.. 17వ శతాబ్ది నాటి మసీదులో వజూఖానా మినహా మిగతా ప్రాంగణమంతా సర్వే జరిపారు. అయితే హిందూ ఆలయం స్థానంలో ఈ కట్టడాన్ని నిర్మించారా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించాలని వారణాసి జిల్లా కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును అలహాబాద్‌ హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో మసీదు ప్రాంగణంలో సర్వే కొనసాగించుకోవడానికి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఏఎస్‌ఐ అధికారులు సర్వే చేపట్టారు.

Pawan Kalyan Serious on Janasena Leaders: జనసేన నేతలకు క్లాస్‌ పీకిన పవన్‌.. అది సమయం వృథా..!

అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా మసీదు కమిటీ వాదనలు వినిపిస్తూ.. ‘‘ప్రార్థనా ప్రదేశాల చట్టాలను ఉల్లంఘిస్తూ ఏఎస్‌ఐ.. 500 ఏళ్ల నాటి చరిత్రను తిరగదోడాలని చూస్తోంది. ఇలా చేస్తే గత గాయాలను మళ్లీ తెరిచినట్టే’’ అని తెలిపింది. మరోవైపు పురావస్తు శాఖ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. సర్వే సమయంలో మసీదు ప్రాంగణంలో ఎలాంటి తవ్వకాలు చేయలేదని, నిర్మాణాలను ధ్వంసం చేయబోమని తెలిపారు.

Manik Rao Thackeray: ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోంది..

అయితే ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేను కొనసాగించొచ్చని పేర్కొంది. కానీ దానికి ఒక షరతు అని పేర్కొంది. ‘నాన్‌-ఇన్వేసివ్‌’ పద్ధతిలో సర్వే జరగాలని ఆదేశించింది. మసీదు నిర్మాణాన్ని ధ్వంసం చేసేలా సర్వేలో ఎలాంటి పరికరాలను ఉపయోగించద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gnanavapi case
  • natiomal news
  • non-invasive
  • Supreme Court
  • Survey

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions