Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. సుప్రీంకోర్టులో కోర్ట్ మాస్టర్ (షార్ట్‌హ్యాండ్) విభాగంలో 20 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 67,700 రూపాయల నుంచి గరిష్టంగా 2,08,700 రూపాయల వరకు భారీ వేతనం లభిస్తుంది. అయితే కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు, షార్ట్‌హ్యాండ్, టైపింగ్‌లో మంచి అనుభవం ఉంటేనే ఈ పోస్టులకు అర్హులవుతారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 25, 2026 నుంచి మొదలైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 15, 2026 రాత్రి 11:55 గంటల వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అర్హతల విషయానికి వస్తే.. అభ్యర్థులు భారత్‌లోని ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 120 పదాల టైప్ చేయగల వేగం, కంప్యూటర్‌పై నిమిషానికి 40 పదాల టైపింగ్ స్పీడ్ తప్పనిసరి. అలాగే ఏదైనా ప్రభుత్వ శాఖ, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ లేదా చట్టబద్ధమైన సంస్థలో ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ లేదా సీనియర్ స్టెనోగ్రాఫర్ హోదాలో కనీసం ఐదేళ్ల పాటు రెగ్యులర్ సర్వీస్ చేసిన అనుభవం ఉండాలి.
Also Read
- 11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
- AR Rahman: "ఆ ఓపిక, సమయం నాకు లేదు".. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
- Arnab Cyclone Alert: 'అర్నబ్' తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
- Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
వయసు అర్హత చూస్తే.. అక్టోబర్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 30 సంవత్సరాలు నిండి ఉండాలి. 45 సంవత్సరాలు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్), మాజీ సైనికోద్యోగులకు నిబంధనల ప్రకారం వయోసడలింపు లభిస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు మరో ఐదేళ్లు అదనపు సడలింపు ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పనిచేస్తున్న డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి వర్తించదు. ఎంపిక ప్రక్రియ మొత్తం నాలుగు దశల్లో ఉంటుంది. మొదటగా 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, భారత రాజ్యాంగంలోని న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలు, సుప్రీంకోర్టు నిబంధనలు, కంప్యూటర్ ఆపరేషన్‌పై ప్రశ్నలు వస్తాయి. ఈ రాత పరీక్షలో కనీసం 50 మార్కులు సాధించడం తప్పనిసరి. ముఖ్యంగా ఈ రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు. దీని తర్వాత ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, చివరగా ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము విషయానికొస్తే.. జనరల్, అన్ రిజర్వుడ్ అభ్యర్థులు 1,500 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్), మాజీ సైనికోద్యోగులకు ఫీజు 750 రూపాయలుగా నిర్ణయించారు. వీటికి అదనంగా బ్యాంక్ ఛార్జీలు వర్తిస్తాయి. ఫీజు మొత్తం ఆన్లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. అన్ని దశల పరీక్షల్లో విజయం సాధించి ఎంపికైన అభ్యర్థులకు 67,700 రూపాయల నుంచి 2,08,700 రూపాయల వరకు భారీ వేతనంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనేక ఇతర అలవెన్సులు కూడా అందజేస్తారు.
తాజావార్తలు
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త