Kota Suicide: పిల్లల ఆత్మహత్యకు కారణం తల్లిదండ్రులే.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kota Suicide: కోటా ఆత్మహత్య కేసులో పిల్లల తల్లిదండ్రులే బాధ్యులంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోటాలో పిల్లలు ఈ స్థాయిలో ఆత్మహత్యలకు పాల్పడడానికి తల్లిదండ్రులే బాధ్యులని కోర్టు పేర్కొంది. దీంతో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కోర్టు నిరాకరించింది. కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 24 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తల్లిదండ్రుల కోరికలను పిల్లలపై రుద్దడం వల్లే వారు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. తల్లిదండ్రులు తమ పిల్లల నుండి వారి సామర్థ్యాల కంటే ఎక్కువ ఆశిస్తారు. దీంతో పిల్లలు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్నారుల ఆత్మహత్యలకు కోచింగ్ సెంటర్లే కారణమంటూ ముంబైకి చెందిన వైద్యుడు అనిరుధ్ నారాయణ్ మల్పానీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
Also Read
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
Read Also:Lesbian Couple: ఇద్దరూ కడుపులో మోసి.. బిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట!
దీంతో పాటు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో కనీస ప్రమాణాలు పాటించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై చట్టం చేసేందుకు కోర్టు నిరాకరించింది. తప్పు పిల్లల తల్లిదండ్రులదే తప్ప కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లది కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కోటాలో ఆత్మహత్య చేసుకున్న పిల్లల వయస్సు 14-16 సంవత్సరాల మధ్య ఉంటుంది.
ఈ ఏడాది రాజస్థాన్‌లోని కోటాలో నీట్, జేఈఈ కోచింగ్‌ల కోసం వచ్చిన 24 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఖ్య గత 8 ఏళ్లలో అత్యధికం. ఆత్మహత్య కేసులను నిరోధించడానికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రత్యేక సిఫార్సులు కూడా చేయబడ్డాయి. ఇంత జరుగుతున్నా ఆత్మహత్యల కేసులు మాత్రం తగ్గడం లేదు.
Read Also:Minster KTR: దుబ్బాకలో కేటీఆర్ పర్యటన.. ముస్తాబాద్ లో రోడ్‌షోలో..
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!