Supreme Court: తల్లి, భార్య, కుమార్తెను హత్య చేసిన నిందితుడు.. 12 ఏళ్ల శిక్ష తర్వాత నిర్దోషిగా ప్రకటన?
- తల్లి.. భార్య.. కుమార్తెను హత్య చేసిన నిందితుడు
- 12 ఏళ్ల శిక్ష తర్వాత నిర్దోషిగా ప్రకటించిన సుప్రీంకోర్టు
- అనుమానం బలంగా ఉన్నా సాక్ష్యం కావాలన్న కోర్టు
- బాంబే హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం
ఉరిశిక్ష పడిన వ్యక్తిని 12 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన అనంతరం సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతను తన భార్య, తల్లి, రెండేళ్ల బాలికను హత్య చేశాడని ఆరోపించారు. 12 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. ఈ 12 సంవత్సరాలలో.. అతను 8 సంవత్సరాలు కఠిన కారాగారశిక్షను ఎదుర్కొన్నాడు. 2012లో పూణేలో జరిగిన ఈ ట్రిపుల్ మర్డర్ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదలకు ఆదేశించింది. అతని నేరాన్ని రుజువు చేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు నిర్ధారించింది.
సుప్రీంకోర్టు సంచలన తీర్పు…
న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, ప్రశాంత్ కుమార్ మిశ్రా, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దిగువ కోర్టు, బాంబే హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. గతంతో ఆ కోర్టు నిందితుడికి మరణ శిక్ష విధించింది. కానీ సాక్ష్యాధారాలను పరిశీలించిన అత్యున్నతన్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారించడానికి ఈ ఆధారాలు సరిపోవని తేల్చింది. కేవలం అనుమానాల ఆధారంగా ఎవరినీ దోషులుగా తేల్చలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Also Read
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Gudivada Amarnath: డేటా సెంటర్‌పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
తీర్పులో కోర్టు ఏం చెప్పింది?
అనుమానం ఎంత బలంగా ఉన్నా సాక్ష్యం స్థానంలో ఉండకూడదనేది స్థిరమైన చట్టమని జస్టిస్ గవాయ్ తీర్పులో పేర్కొన్నారు. ఒక నిందితుడు దోషిగా రుజువైయ్యే వరకు అతడు నిర్దోషిగానే పరిగణించబడతాడని స్పష్టం చేశారు. పొరుగువారి వాంగ్మూలం ఆధారంగా ట్రయల్ కోర్టు, బాంబే హైకోర్టు అతన్ని దోషిగా నిర్ధారించాయి. అయితే, ఈ ప్రకటన చాలా వైరుధ్యాలతో కూడుకున్నదని, సందర్భోచిత సాక్ష్యాలు కూడా అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఖచ్చితమైన నిర్ధారణకు రాలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేసిన న్యాయమూర్తి..
న్యాయమూర్తి గవాయ్ మాట్లాడుతూ.. “ప్రాసిక్యూషన్ నేరాన్ని అంచనా వేయడానికి అన్ని పరిస్థితులను పూర్తిగా నిర్ధారించడం అవసరం. నిందితుడిని దోషిగా నిర్ధారించే ముందు అతడు దోషి అని రుజువు చేసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. ” అని పేర్కొన్నారు. ‘నిరూపించబడవచ్చు’ మరియు ‘తప్పక నిరూపించబడాలి’ అనే వాటి మధ్య వ్యాకరణం మాత్రమే కాదు.. చట్టబద్ధమైన తేడా కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
- ఈ నిర్ణయంతో ఇతర కేసులు కూడా ప్రభావితం..
న్యాయ ప్రక్రియలో సాక్ష్యం ఎంత ముఖ్యమైనదో ఈ కేసు తెలియజేస్తుంది. కేవలం అనుమానాల ఆధారంగా ఎవరినీ శిక్షించలేమని సుప్రీంకోర్టు తన నిర్ణయం ద్వారా స్పష్టం చేసింది. ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేకుండా జైల్లో ఉన్న వారందరికీ ఈ నిర్ణయం ఆశాకిరణం.
తాజావార్తలు
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్‌దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో