Superstar Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియనివారు ఉండరు.. తమిళ సూపర్ స్టార్ అయినా అన్ని రాష్ట్రాలకు ఆయనకు అభిమానులు ఉంటారు.. ఇక సింపుల్ సిటీకి పెట్టింది పేరు రజనీ.. సినిమాల్లో ఆయన స్టైల్స్, డైలాగ్‌లు ఎలా ఉన్నా.. బయట మాత్రం.. ఆయన సూపర్ స్టారేనా? అనే అనుమానం కలిగే విధంగా సాదాసీదాగా ఉంటారు. ఇక, సూపర్ స్టార్ మన విజయవాడకు త్వరలోనే రాబోతున్నారు.. ఈ నెల 28వ తేదీన బెజవాడలో పర్యటించనున్నారు రజనీకాంత్..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
రజనీకాంత్ విజయవాడకు వస్తున్నారంటే ఏదో సినిమా షూటింగ్ కావొచ్చు అని లైట్ తీసుకోకుండి.. ఎందుకంటే.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు రజనీ.. బెజవాడ పొరంకిలోని అనుమోలు గార్డెన్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఇక, ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నటసింహా, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొనబోతున్నారు.. మొత్తంగా ఒకే వేదికను పంచుకోబోతున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్, చంద్రబాబు, బాలకృష్ణ. ఎన్టీ రామారావు శత జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సభలో ముఖ్యఅతిధిగా రానున్నర రజనీకాంత్.. ఎన్టీఆర్ ప్రసంగాలపై ప్రచురించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు..