ఐపీఎల్ 2024లో కేకేఆర్ తరుఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ కీలక ప్రకటన చేశాడు. తాను టీ20 ప్రపంచకప్ లో రీఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలపై స్పందించాడు. తిరిగి మళ్లీ వెస్టిండీస్ జట్టులోకి రాలేనని.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాడు. రీఎంట్రీకి తలుపులు మూసుకుపోయాయని అన్నాడు. ఈ విషయమై నరైన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశాడు.
Read Also: DGCA: 12 ఏళ్ల లోపు పిల్లలు విమానాల్లో తప్పనిసరిగా తల్లిదండ్రులతో కూర్చోవాలి..
“టీ20 వరల్డ్‌కప్ ఆడాలనే అభిమానుల ప్రతిపాదనను గౌరవిస్తాను. అయితే తిరిగి జట్టులోకి వచ్చే ఆలోచన లేదు. ప్రపంచకప్ ఆడే విండీస్ జట్టుకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మా జట్టుకు ఆల్ ది బెస్ట్. గత కొన్ని నెలలుగా కష్టపడి, మరో టైటిల్‌ను గెలుచుకునే సత్తా తమకు ఉంది. మా జట్టులో మంచి సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. మీకు అంత మంచి జరగాలని ఆశిస్తున్నాను.” అని తన ప్రకటనలో తెలిపాడు. మరోవైపు వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ ఇటీవల మాట్లాడుతూ.. “సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి రావడం గురించి అతనితో ఏడాదికి పైగా మాట్లాడుతున్నానని చెప్పాడు. నా ప్రయత్నం టీ20 ప్రపంచ కప్ 2024లో ఆడేలా అతన్ని ఒప్పించడమేనని” తెలిపారు. కాగా.. గత కొన్ని రోజులుగా సునీల్ నరైన్ టీ20 వరల్డ్‌కప్ ఆడనున్నాడని జరుగుతున్న ప్రచారానికి తెర పడినట్లైంది.
Read Also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అయిదేళ్ల సంపాదనెంతో తెలుసా..?
ఇదిలాఉంటే.. ఈ ఐపీఎల్ సీజన్‌లో నరైన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచులాడిన ఈ ఆల్‌రౌండర్ 286 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది. అటు బౌలింగ్‌లో కూడా 9 వికెట్లతో సత్తాచాటాడు.
