Site icon NTV Telugu

Sunil Gavaskar: అశ్విన్ ‘కోలిగ్స్’ కామెంట్లపై సునీల్ గవాస్కర్ రియాక్షన్

Sunil Gavaskar

Sunil Gavaskar

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు దక్కకపోవడంతో చాలామంది ఆశ్చర్యాన్నికి గురయ్యారు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమితో అశ్విన్‌ని తీసుకోకపోవడం వల్లేనని మాజీ క్రికెటర్లు కూడా వ్యాఖ్యానించారు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్ చేసిన ట్వీట్ ఇప్పుడు గందరగోళం రేపుతుంది. అశ్విన్ ట్వీట్.. ఇంతకుముందు టీమ్‌లో అందరూ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లు.. ఇప్పుడు పరిస్థితి అలా లేదు, జస్ట్ కోలిగ్స్‌లా ఉంటున్నారంతే అంటూ రాసుకొచ్చాడు.

Read Also: MP Arvind : ముఖ్యమంత్రి కాదు.. మొదట సీతక్కను పీసీసీ చేయగలరా? రేవంత్ సమాధానం చెప్పాలి

టీమిండియాలో ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయింది.. మన పని ఏంటి? అది చేశామా.. లేదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, కనీసం పక్కనున్న ప్లేయర్ ఎలా ఉన్నాడు? ఏం ఆలోచిస్తున్నాడనే విషయాలను కూడా పట్టించుకోవడం లేదని ఆర్. అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అశ్విన్ చేసిన కోలిగ్స్ కామెంట్లు నన్ను చాలా బాధపెట్టాయని సీనియర్ క్రికెటర్ సునీల్ గావాస్కర్ అన్నారు. ఎందుకంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకోకపోతే ఎలా? క్రికెట్ గురించి కాకపోయినా మ్యూజిక్ గురించి, సినిమాల గురించి, రాజకీయాల గురించి.. ఏదో ఒకటి మాట్లాడుకోవాలి అంటూ సన్నీ తెలిపారు.

Read Also: Minister RK Roja: పవన్‌కు మాస్‌ వార్నింగ్‌.. వెంట్రుక కూడా పీకలేవు..!

అలా మాట్లాడుకున్నప్పుడే ఆటలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది అని సునీల్ గవాస్కర్ తెలిపారు. అనవసర ఆలోచనలతో అలిసిపోయిన మెదడు, కాస్త డైవర్ట్ అవుతుంది.. ప్లేయర్ల మధ్య అనుబంధం పెరిగి, స్నేహంగా మారుతుంది అని సన్నీ పేర్కొన్నారు. మ్యాచ్ అయ్యాక జోకులు, నవ్వులు, అల్లర్లు, సరదాలు, స్నేహాలు.. ఇవి చాలా కామన్.. ఇంతకు ముందు ప్లేయర్లందరికీ ఒకే గదిలో ఉంచేవాళ్లు.. 20 ఏళ్లకి ముందు ఏ ఫారిన్ టూర్‌కి వెళ్లినా ప్లేయర్లు అంతా కలిసి ఉండేవాళ్లమని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్లేయర్‌కో సింగిల్ గది ఇచ్చేవాళ్లు.. ఇప్పుడు ప్రతీ ప్లేయర్‌కి ఓ సెపరేట్ స్పెస్ ఉంటోంది.. దీని వల్ల ప్లేయర్ల మధ్య అంతరం పెంచుతోంది అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కామెంట్స్ చేశాడు.

Exit mobile version