Site icon NTV Telugu

Sunil Gavaskar: ఆస్ట్రేలియాలో సునీల్ గవాస్కర్‌కి ఘోర అవమానం!.. భారతీయుడు కాబట్టే..

Sunil Gavaskar 2

Sunil Gavaskar 2

స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 3-1తో భారత జట్టును ఓడించింది. దీంతో కంగారూ జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కానీ.. ఈ సమయంలో లెజెండ్ సునీల్ గవాస్కర్ కు ఆగ్రహం తెప్పించేలా ఓ సంఘటన చోటుచేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1996-97 నుంచి భారత క్రికెట్ జట్టు- ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది.

READ MORE: Alleti Maheshwar Reddy: హెటిరో స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి

తాజాగా సిరీస్‌లోని ఐదవ టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. గెలుపొందిన కెప్టెన్‌కు ట్రోఫీని అందజేయడానికి ఓ ప్రజెంటేషన్ వేడుక నిర్వహిస్తారు. దీనికి గవాస్కర్‌ని ఆహ్వానించలేదు. ఈ ట్రోఫీకి సునీల్ గవాస్కర్ – ఆస్ట్రేలియా లెజెండ్ అలన్ బోర్డర్ పేరు పెట్టారు. ఈ వేడుకలో బోర్డర్‌ని పిలిచి విజేత కెప్టెన్ పాట్ కమిన్స్‌కు ట్రోఫీని అందజేసాడు. ఈ సమయంలో గవాస్కర్ మైదానంలో ఉన్నప్పటికీ.. అతడిని పట్టించుకోలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గవాస్కర్.. తాను భారతీయుడిని కాబట్టి తనకు ఇలా చేశానని వాపోయాడు.

READ MORE: Renu Desai: అఖిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్!

నేను భారతీయుడిని కాబట్టి నన్ను ఆహ్వానించలేదు: గవాస్కర్
ఈ సందర్భంగా కోడ్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ప్రెజెంటేషన్ వేడుకకు వెళితే సంతోషంగా ఫీల్ అయ్యేవాడినని గవాస్కర్ అన్నాడు. ‘నేను మైదానంలోనే ఉన్నాను. ఆస్ట్రేలియాకు ట్రోఫీ ఇచ్చినా పట్టించుకోను. మెరుగైన క్రికెట్ ఆడి విజయం సాధించారు. సరే.. నేను భారతీయుడిని కాబట్టి ప్రదర్శన వేడుకకు ఆహ్వానించలేదు. ట్రోఫీని నా మిత్రుడు అలన్ బోర్డర్‌తో కలిసి ట్రోఫి పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉండేది.” అని తెలిపారు. కాగా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2022-23ని భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సునీల్ గవాస్కర్ అందజేశారు.

Exit mobile version