టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఖాతాలో హిట్ సినిమాలు పెద్దగా లేవని తెలిసిందే.. సరైన హిట్ పడి చాలా కాలం అయ్యింది. వరస పెట్టి ప్రయోగాలు లాంటి సినిమాలు డిఫరెంట్ కాన్సెప్టు లతో చేస్తున్నా కలిసి రావటం లేదు.. అయినా సందీప్ అదే ప్రయోగాలు చేస్తున్నారు.. తాజాగా సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. సూపర్ నేచురల్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఉన్న ఈ సినిమా మంచి టాక్ ను అందుకుంది..
ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. దాంతో సందీప్ కిషన్ అదే బ్యానర్ లో మరో సినిమా చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. రవితేజ కెరీర్ లో రీసెంట్ గా సూపర్ హిట్ గా నిలిచిన థమాకా దర్శకుడు నక్కిన త్రినాధరావు ఈ చిత్రానికి దర్శకుడు అని తెలుస్తోంది. ఓ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ , హస్య మూవీస్ పతాకం పై రాజేష్ దండా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
ప్రస్తుతం ఈ సినిమా కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.. ఫైనల్ అయితే త్వరలో ఎనౌన్సమెంట్ వస్తుందని అంటున్నారు.. కొత్త డైరెక్టర్లు, ప్లాపుల్లో ఉన్న దర్శకులు మాత్రమే సందీప్ కిషన్ తో సినిమా చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టు సెట్ అయితే కనుక సందీప్ కిషన్ కమర్షియల్ జానర్ లో సినిమా అవుతుందని, మళ్లీ సందీప్ కిషన్ ఫామ్ లోకి వస్తాడని వినిపిస్తోంది. వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమా తరహాలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది.. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది..