Sundar Pichai: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ ఇంగ్లాండ్ గెలుపు దిశగా కొనసాగుతోంది. సిరీస్‌లో ఇప్పటికే వెనుకబడి ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సమం చేసేందుకు ప్రయతించినా.. అవి పాలిచినట్లు కనపడలేదు. చివరి 4 మ్యాచ్‌ల కంటే కాస్త ఆసక్తికరంగా మారిన ఈ హై-వోల్టేజ్ టెస్టును చూడటానికి అనేక మంది ప్రముఖులు స్టేడియానికి హాజరయ్యారు. శనివారం నాడు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్ చూడడానికి ప్రత్యక్షంగా హాజరైన సంగతి తెలిసిందే.
Chicken Dum Biryani Recipe: నోరూరించే చికెన్ దమ్ బిర్యానీ.. ఇంట్లోనే చేసుకోండిలా..
ఇకపోతే మరోవైపు మ్యాచ్ సమయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వ్యక్తి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సుందర్ పిచాయ్ స్టేడియంలోని కామెంటరీ బాక్స్‌లో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కామెంటేటర్ హర్ష భోగ్లేతో కలిసి కొద్దిసేపు కామెంటరీ కూడా అందించారు. ఆ సమయంలో తన చిన్ననాటి జ్ఞాపకాలు, క్రికెట్‌పై ఉన్న అభిమానం గురించి పంచుకున్నారు.
ఈ సమయంలో పిచాయ్ మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచే క్రికెట్‌కు అభిమానినని.. తన బెడ్రూమ్ గోడలపై సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పోస్టర్లు ఉండేవని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే తన అభిమాన క్రికెటర్లు అవుట్ కావడం తట్టుకోలేకపోయేవాడినని, అందుకే లైవ్ మ్యాచ్‌లు చూడటం చాలా తక్కువ అని వివరించారు. ఇందుకు సంబంధించిన కామెంటరీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Anirudh: ఇదేంట్రా అయ్యా.. చాట్ జీపీటీతో అనిరుధ్ మ్యూజిక్?
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటింది. మొదటి ఇన్నింగ్స్‌లో 23 పరుగుల వెనుకబడిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో అదిరిపోయే బ్యాటింగ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. యశస్వి జైస్వాల్ సెంచరీతో పాటు, ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలతో జట్టు భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టూ కూడా ధాటిగా ఆడుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ మ్యాచ్ గెలుపు దిశగా సాగుతోంది.
A surprise in the commentary box 🤩
Google CEO Sundar Pichai joins Harsha Bhogle for a short commentary stint 😲#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @bhogleharsha @sundarpichai pic.twitter.com/ZmI4jtulwd
— Sony Sports Network (@SonySportsNetwk) August 2, 2025