NTV Telugu Site icon

Summer Effect: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న సూరీడు.. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు

Summer

Summer

Summer Effect: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. నేటి నుంచి 5రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం 10 గంటల నుంచే ఎంత తీవ్రత అధికంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో ఎండల మండుతున్నాయి. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో ఇవాళ 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదు కావడం గమనార్హం. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో 42.5 ఆదిలాబాద్ జిల్లా అర్లీ టి లో 42.3 గా నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

 

తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు 

Read Also: Chandrababu: బుక్కరాయసముద్రం ప్రజాగళం సభలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

దక్షిణాది నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న గాలుల ప్రభావంతో హైదరాబాద్‌లో ఉక్కపోత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఒక డిగ్రీ అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నేటి(మార్చి 28) నుంచి మూడ్రోజులు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్‌, మే నెలల్లో ఈ సారి ఎండలు భగ్గుమంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యమైన పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళలో బయటకు వస్తే మంచి నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగాలని సూచించారు. డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా తరుచూ మంచి నీరు తాగాలని కోరారు.

Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి దక్కని ఊరట..ఏప్రిల్ 1 వరకు కస్టడీ పొడగించిన కోర్టు..

అటు ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రత కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీలు కూడా నమోదవుతోంది. రాయలసీమ ప్రాంతంలో ఎండలు దంచికొడుతున్నాయి. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇక విజయవాడ, ఏలూరు, ఒంగోలు, రాజమండ్రి ప్రాంతాల్లో 43-44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటోంది. గాలిలో తేమ క్రమంగా తగ్గుతూ వేడి గాలులు మొదలవుతున్నాయి. ఉదయం 8-9 గంటల్నించే ఎండల తీవ్రత పెరిగిపోతోంది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో రోజువారీ కూలీలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రానున్న 5 రోజులు రాయలసీమతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. ఏప్రిల్ చివరి వారం, మే నెల ప్రారంభంలో రాయలసీమలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరే అవకాశం ఉందన్నారు.

Show comments