Site icon NTV Telugu

Amardeep : “సుమతీ శతకం” నుండి మెలోడియస్ అప్‌డేట్..

Sumathi Shathakam

Sumathi Shathakam

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్న క్లీన్ ఎంటర్టైనర్ ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్.. ‘ఎక్కడే ఎక్కడే’ సాంగ్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా ఈ చిత్రం నుండి రెండో పాట ‘సుమతి సుమతి’ని విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఫిబ్రవరి 6న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, ఈ కొత్త పాట సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.

Also Read : Nara Rohit : నెట్టింట వైరల్ అవుతున్న నారా రోహిత్ – శిరీష వెడ్డింగ్ వీడియో

“నా కుట్టీ కుట్టీ సుమతీ.. నా చిట్టీ చిట్టీ సుమతీ..” అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌ను సుభాష్ ఆనంద్ స్వరపరచగా, కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు. గోల్డ్ దేవరాజ్ ఆలపించిన ఈ పాటలో అమర్దీప్ తన ప్రేయసిపై ఉన్న ఇష్టాన్ని తెలుపుతూ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్ చాలా ఫ్రెష్‌గా ఉండటంతో ఈ పాట యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. టేస్టీ తేజ, మహేష్ విట్ట వంటి నటులు ఉండటంతో సినిమాలో వినోదానికి కూడా కొదవలేదని అర్థమవుతోంది. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అమర్దీప్ చౌదరికి మంచి బ్రేక్ ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

 

Exit mobile version