Site icon NTV Telugu

Peddi: శిష్యుడి కోసం రంగంలోకి దిగిన సుకుమార్.. రామ్ చరణ్ ‘పెద్ది’పై స్పెషల్ ఫోకస్!

Ramcharan Peddhi

Ramcharan Peddhi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ ఆ క్రేజ్‌ను స్కై హైకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ సినిమా బాధ్యతను దర్శకుడు సుకుమార్ తన భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. తన శిష్యుడు బుచ్చిబాబు కోసం సుకుమార్ స్వయంగా ఎడిటింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారట. సినిమా ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్‌గా ఉండాలని ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Also Read : venky pooja: వెంకీ మూవీలో పూజా హెగ్డే..రూమర్స్‌కు ఫుల్ స్టాప్

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పూర్తయ్యిందని, సుకుమార్ స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు కూడా చేశారని సమాచారం. కేవలం మెంటార్‌గానే కాకుండా, ప్రాజెక్ట్‌ను దగ్గరుండి నడిపిస్తూ ఔట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చూసుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్‌గా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ముందుగా మే 1న విడుదల చేయాలనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం కొత్త డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారు. సుకుమార్ పర్యవేక్షణలో వస్తున్న ‘పెద్ది’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో ‘రంగస్థలం’ తర్వాత మరో మాస్టర్ పీస్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీ టాక్.

Exit mobile version