Suhasini: రజనీ-మణిరత్నం కాంబోలో సినిమా.. క్లారిటీ ఇచ్చిన సుహాసిని!
- రజనీకాంత్-మణిరత్నం కాంబోలో దళపతి చిత్రం
- 33 ఏళ్ల తర్వాత ఈ హిట్ కాంబోలో కొత్త ప్రాజెక్ట్
- క్లారిటీ ఇచ్చిన నటి సుహాసిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth-Mani Ratnam’s Movie Update: 1991లో సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం కలయికలో వచ్చిన ‘దళపతి’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. 33 ఏళ్ల తర్వాత ఈ హిట్ కాంబోలో ఓ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగాయని.. అన్నీ కుదిరితే డిసెంబరులో సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశముందని వార్తలు చక్కర్లు కొట్టాయి.ఈ వార్తలపై నటి, మణిరత్నం సతీమణి సుహాసిని స్పందించారు.
రజనీకాంత్, మణిరత్నం కలయికలో సినిమా అంటూ వస్తున్న వార్తలు రుమార్స్ మాత్రమే అని సుహాసిని చెప్పారు. ఓ జాతీయ మీడియాతో సుహాసిని మాట్లాడుతూ… ‘రజనీకాంత్, మణిరత్నం కలయికలో సినిమా లేదు. అవి కేవలం రుమార్స్ మాత్రమే. బహుశా ఈ విషయం వాళ్లిద్దరికీ కూడా తెలిసి ఉండదేమో. రజనీ, మణిరత్నం సినిమా అంటూ జనాలు మాత్రమే రాస్తున్నారు’ అని సుహాసిని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ హిట్ కాంబో ఎప్పుడో పునరావృతం అవుతుందో చూడాలి. రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’ దసరాకు విడుదలైన విషయం తెలిసిందే.
Also Read
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
Also Read: Kohli-Rohit: విరాట్ కోహ్లీతో పోస్టర్.. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్!
రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం 2025లో థియేటర్లలోకి రానుంది. జైలర్ 2 పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. మరో ఇద్దరు యువ దర్శకులు రజనీ కోసం కథలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు మణిరత్నం ప్రస్తుతం కమల్ హాసన్‌తో ‘థగ్ లైఫ్’ చేస్తున్నారు. 1987లో వచ్చిన నాయకన్ (నాయకుడు) తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న సినిమా ఇది.
తాజావార్తలు
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!