కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.. ఈ మధ్య రిలీజ్ అవుతున్న ఈయన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. రైటర్ పద్మభూషణ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు..
రీసెంట్ గా అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ తో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు ‘ప్రసన్న వదనం ‘ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా ఈరోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మరి జనాల స్పందన ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం పదండీ..
సుహాస్ స్క్రిప్ట్ సెలక్షన్ అదిరింది.. ఊహించని ట్విస్టులతో ఇంటర్వెల్ సీన్ బాగుందని.. మరోసారి తన అద్భుతమైన నటనతో సుహాస్ అదిరగొట్టేశాడని.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ రివ్యూస్ ఇస్తున్నారు..
@ActorSuhas Anna Ni script selection ki 🫡🫡 (3/5) #PrasannaVadanam
— Suky (@decentabbai) May 3, 2024
ఫస్ట్ ఆఫ్ తర్వాత అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు.. అస్సలు ఊహించలేదు.. సుహాస్ పెర్ఫార్మన్స్ ఎప్పటిలాగే అదిరిపోయింది.. సెకండ్ ఆఫ్ కూడా చాలా బాగుందని ఓ యూజర్ రాసుకొచ్చాడు..
#PrasannaVadanam
Just now Completed First half 👍
Good interval with Unexpected twist 💥@ActorSuhas nailed with his performance as Face blindness 🔥🔥
Bgm eyyite adiripoyindi intense scenes
Very well setup for second half 👏👏— ganesh dhoni talkies (@GDTalkies) May 2, 2024
సుహాస్ ఆదరగోట్టాడు..మరోసారి సూపర్ హిట్ అందుకున్నాడు సుహాస్. ఈసారి మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ స్క్రిప్ట్ తో సుహాస్ మెప్పించాడని.. డైరెక్టర్ అర్జున్ సరికొత్త కథ రాసుకున్నాడని మరోకరు రాశారు..
#PrasannaVadanam
Another clean hit from @ActorSuhas 👍
Congratulations to the whole team for the HIT 💥💥
First Summer HIT from Tollywood 😍
Director Arjun direction is simply superb 👌 @RashiReal_ performance will be the main Highlight 👌👍 pic.twitter.com/Idkoi7jwx1— ganesh dhoni talkies (@GDTalkies) May 2, 2024
"Prasanna Vadanam is a gripping thriller with standout performances and masterful direction by Arjun, delivering an unforgettable cinematic experience."#PrasannaVadanam
— subrahmanyam reddy (@bhupathisubbu) May 2, 2024
మొత్తంగా చూసుకుంటే సుహాస్ ఈ సినిమాతో కూడా ఆడియన్స్ ను మెప్పించాడని తెలుస్తుంది.. ఈ సినిమా 3 /5 రేటింగ్ ను ఇస్తున్నారు.. దీంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చెయ్యాల్సిందే..