Sudheer Babu-Mahesh Babu: మహేష్ బాబుకి సుధీర్ బాబు ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే?
- పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా హరోం హర
- హరోం హర ప్రీ రిలీజ్ ఈవెంట్
- మహేష్ బాబుకి సుధీర్ బాబు ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu and Sudheer Babu Audio Clip: సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక రూపొందిస్తున్న చిత్రం ‘హరోం హర’. ఈ సినిమాను సుమంత్ జి.నాయుడు నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ కథానాయిక కాగా.. సునీల్ ముఖ్య పాత్ర పోషించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కిన ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం (జూన్ 11) రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు సుధీర్ బాబు కాల్ చేశారు. ఇందుకు సంబధించిన ఓ ఆడియో కాల్ నెట్టింట వైరల్ అయింది.
హరోం హర సినిమా జూన్ 14న రిలీజ్ అవుతోంది, ఆ సినిమాకు సంబంధించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను అని మహేష్ బాబుతో సుధీర్ బాబు అన్నారు. ‘అందరికి నమస్కారం. హరోం హర టీంకు ఆల్ ది బెస్ట్. సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఎంతలా కష్టపడ్డారో తెలుస్తోంది’ అని సూపర్ స్టార్ అన్నారు. సినిమాలో షూటింగ్ లేదా ట్రైనింగ్‌కి సంబందించి గన్స్‌తో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని సుధీర్ అడగ్గా.. ‘ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. కానీ టక్కరి దొంగ సినిమాలో మొదటిసారి వాడాను. చాలా గన్స్ వాడాను. మోసగాళ్లకు మోసగాడు సినిమా గుర్తొచ్చింది’ అని మహేష్ చెప్పారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
Also Read: Harom Hara Movie: క్లైమాక్స్ మతి పోయేలా ఉంటుంది.. ఊహించని సినిమా ఇది!
గన్స్‌ను బాగా హ్యాండిల్ చేసిన మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరు అనే ప్రశ్నకు ‘మీ అందరికీ తెలిసిందే. నాన్న గారే. మోసగాళ్ళకు మోసగాడు సినిమా వంద సార్లు చూసి ఉంటాను’ అని మహేష్ బాబుతో సుధీర్ బాబుతో అన్నారు. హరోం హర సినిమాలో ఓ గన్‌కు కృష్ణ గారి పేరు పెట్టాం అని సుధీర్ చెప్పారు. హరోం హరలో మీకు నచ్చిన పాట ఏది అని సుధీర్ అడగ్గా.. ‘టైటిల్ ట్రాక్ బాగుంది. నీక్కూడా మెసేజ్ చేసాను’ అని జవాబిచ్చారు. ట్రైలర్‌లో నీకు నచ్చిన ఎలివెంట్స్ ఏంటి అనే ప్రశ్నకు.. ‘నువ్వు కొత్తగా కనిపించావు. స్టోరీ బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉంది. అబిమానులకు నచ్చుతుంది’ అని తెలిపారు. మహేష్ ఆడియో క్లిప్‌ను సుధీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!