Suryapet : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి నందు మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స ను ప్రభుత్వ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. మిర్యాల గ్రామానికి చెందిన 60 సంవత్సరాల వయసు ఉన్న రామతార అనే వ్యక్తి కి వయస్సు రీత్యా వచ్చిన కుడి కాలి మోకాలి నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరాడు. మోకాలి నొప్పి కారణంగా నడవలేక బాధపడుతున్నట్లు అక్కడనున్న వైద్యులకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో పరీక్షలు నిర్వహించిన సూర్యాపేట జనరల్ ఆసుపత్రి కి చెందిన వైద్యులు ఆపరేషన్ చేయాలని తెలిపారు.
Read Also: Brahmaji: ఏయ్.. ఏయ్.. అన్నా.. హీరోయిన్ తో పులిహోర కలుపుతున్నావా..?
మోకాలి చిప్ప మార్పిడి అనివార్యం కావడంతో వైద్యుల బృందం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన శస్త్రచికిత్స లో వైద్యులు డాక్టర్ సుధీర్, డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రీనివాస్ హెచ్ వొడి, డాక్టర్ గీత హెచ్ వోడి ఎనస్తీషియా డాక్టర్ గిరిధర్ పాల్గొన్నారు. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో ఐదు లక్షల రూపాయలు ఖర్చయ్యే శస్త్రచికిత్సను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఉచితంగా నిర్వహించి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
Read Also:What is this: శకుంతలకూ… జ్వరమొస్తుందా!?