Stuart Broad Becomes Second Pacer In Test History To Completes 600 Wickets: ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా బ్రాడ్ నిలిచాడు. యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‌ని అవుట్ చేయడం ద్వారా బ్రాడ్ ఖాతాలో 600వ టెస్ట్ వికెట్ చేరింది. మరోవైపు టెస్టుల్లో అత్యధిక వికెట్స్ తీసిన రెండో ఫాస్ట్ బౌలర్‌గానూ బ్రాడ్ రికార్డుల్లో ఉన్నాడు.
స్టువర్ట్ బ్రాడ్ 165వ మ్యాచ్‌లో టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 37 ఏళ్ల బ్రాడ్ టెస్టుల్లో 600కి పైగా వికెట్లు తీసిన రెండో ఫాస్టెస్ట్ బౌలర్‌గా, ఓవరాల్‌గా ఐదో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్‌గా శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800) మొదటి స్థానంలో ఉన్నాడు. షేన్ వార్న్ (708), జేమ్స్ అండర్సన్ (688), అనిల్ కుంబ్లే (619) మాత్రమే బ్రాడ్ కంటే ముందున్నారు.
Also Read: Shah Rukh Khan ICC: వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో షారుఖ్ ఖాన్.. ఇక భారత్‌ను ఎవరూ ఆపలేరు!
ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ కలిగి ఉన్నాడు. అండర్సన్ ఇప్పటివరకు 181 టెస్టు మ్యాచ్‌ల్లో 688 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన రెండో ఫాస్ట్ బౌలర్‌గా స్టువర్ట్ బ్రాడ్ ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ (563) మూడో స్థానంలో ఉండు. మరోవైపు ఆస్ట్రేలియాపై బ్రాడ్ తన 149వ టెస్ట్ వికెట్‌ని సాధించాడు. ఆసీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్ ఇయాన్ బోథమ్ (148)ను అధిగమించాడు.
600 TEST WICKETS FOR BROAD!!
A historic moment!!! pic.twitter.com/Z3pGuvsqjm
— Johns. (@CricCrazyJohns) July 19, 2023