వీధికుక్కలు రెచ్చిపోతున్నాయి. కనిపించిన వారిని కనిపించినట్టు పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరిపై దాడులు చేస్తున్నాయి. దీంతో జనం రోడ్డుమీద నడవాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం తిప్పరాజుపాలెం గ్రామంలో హేమంత్ అనే రెండేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఇంటి దగ్గర ఆడుకుంటుండగా దాడి చేశాయి వీధి కుక్కలు. దీంతో ఆ చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు అయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే హేమంత్ ని కాకినాడ జీ జీ హెచ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: Tamilnadu Live: వీడు మనిషి కాదు.. ఐదువేల కోసం దారుణం
హేమంత్ కి ముఖం పై కుట్లు వేసి, మైనర్ సర్జరీ చేశారు వైద్యులు. పూర్తిగా రికవరీ అయ్యే వరకు అబ్జర్వేషన్ లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా వెళ్తుంటే తరచు కుక్కలు దాడులు చేస్తున్నాయని చెబుతున్నారు గ్రామస్తులు. నిత్యం కుక్కల దాడులతో జనం హడలి పోతున్నారు. హైదరాబాద్ లో చిన్నారిని కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన కలకలం రేపింది. కుక్కల్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also:Kerala BJP chief: కేరళలో ప్రధాని మోడీ హత్యకు కుట్ర.. బీజేపీకి బెదిరింపు లేఖ