NTV Telugu Site icon

Strange Incident : మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో వింత ఘటన.. నేలపై అమ్మవారి పాద ముద్ర ప్రత్యక్షం

Goddess Foot

Goddess Foot

Strange Incident : పాతబస్తీ మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో వింత ఘటన చోటు చేసుకుంది. శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ఆవరణలో మంగళవారం రాత్రి నేల మీద పసుపు పై ఒక పాద ముద్ర ప్రత్యక్షమయ్యింది. స్వామి పూజ చేసుకుని దేవాలయంలోని సన్నిధానానికి రాత్రి 11.32గంటలకు చేరుకున్న బాలకృష్ణ అనే యువకుడు మొట్ట మొదట అక్కడ అమ్మవారి పాద ముద్ర ఉన్నట్లు గుర్తించాడు. ఒకే కాళు కు సంబంధించిన పాద ముద్ర మాత్రమే స్పష్టంగా ఉండడంతో వెంటనే బాలకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు పొన్న వెంకటరమణతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులకు తెలిపారు. ఆలయంలోకి చేరుకున్న పొన్న వెంకటరమణతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు అమ్మవారి పాదం, కాలి వేళ్లకు గోళ్ళు కూడా స్పష్టంగా కనిపించడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అమ్మవారు బాలిక రూపంలో ఆలయం చుట్టూరా తిరిగి ఉండవచ్చని పాద ముద్ర పడ్డ చోట ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Kerala: లగ్జరీ కార్లను వీడియో తీస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు

ఈ విషయం కాస్త బుధవారం ఉదయం దావానాంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుని సాక పెట్టడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్న వెంకట రమణ మాట్లాడుతూ మేకల్​ బండ శ్రీ నల్ల పోచమ్మ ఆలయానికి 500 ఏళ్ల ఘన చరిత్ర కలిగి ఉందని, శ్రీ చక్రం ఆకారంలో ఆలయ గోపురం ఉంటుందన్నారు. గత బోనాలకన్నా మునుపు సుభాష్​ అనే భక్తునికి అమ్మవారు కలలో ప్రత్యక్షమయి బంగారు చీర చేయించాలని చెప్పిందన్నారు. అదే ప్రకారం సుభాష్​అనే వ్యక్తి బోనాల సమయంలో బంగారు చీరను ప్రత్యేకంగా తయారు చేయించి, బహూకరించారన్నారు. బంగారు చీర చేయించన సందర్భంగా అమ్మవారు సంతోషంగా ఆలయం చుట్టూ తిరుగుతుందని పొన్న వెంకట రమణ పేర్కొన్నారు.

Samantha : అతనితో పెళ్లి..2025లో పిల్లలను కనబోతున్న సమంత