Site icon NTV Telugu

Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

Stock Markets Today

Stock Markets Today

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా ఎగిసిన ఆ తరువాత సెన్సెక్స్‌‌ 641 పాయింట్ల లాభంతో 52239 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 15550 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. జాతీయం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ లాభాలు ఎంతవరకు కొనసాగుతాయనేది చూడాల్సి ఉంది. ఒక్క ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్‌ మినహా అన్ని రంగాల షేర్లలోనే కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ 52 వేలను, నిఫ్టీ 15500 స్థాయిని అధిగమించడం విశేషం.

డాలరుతో రూపాయి మారకం విలువ రూ.78 వద్ద కొనసాగుతోంది. చాలా వరకు అన్ని కంపెనీల షేర్లు లాభాల్లోనే పయనిస్తున్నాయి. రిలయన్స్, టైటాన్, టాటా స్టీల్, కొటక్ మహీంద్ర, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం, హిందాల్కో, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి.

Exit mobile version