Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మరో రికార్డ్ సృష్టించిన నిఫ్టీ

  • లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • ఆల్ టైమ్ కొత్త రికార్డ్ సృష్టించిన నిఫ్టీ
  • 23 322 దగ్గర ముగిసిన నిఫ్టీ
Ni

Ni

మొత్తానికి రెండ్రోజుల ఒడుదుడుకులకు ఫుల్ స్టాప్ పడింది. బుధవారం స్టాక్ మార్కెట్లలో సానుకూల పవనాలు వీచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కొనుగోళ్లు ఉత్సాహంగా కొనసాగాయి. ఉదయం నుంచి ట్రేడింగ్ సూచీలు లాభదాయకంగా సాగాయి. ఇక నిఫ్టీ ఆల్ టైమ్ కొత్త రికార్డ్ సృష్టించింది. సెన్సెక్స్ 149 పాయింట్లు లాభపడి 76, 606 దగ్గర ముగియగా.. నిఫ్టీ 58 పాయింట్లు లాభపడి 23, 322 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Death sentence: అత్తని 95 సార్లు పొడిచి చంపిన మహిళ.. మరణశిక్ష విధించిన కోర్టు..

రియల్టీ ఇండెక్స్ మినహా అన్ని రంగాలు గ్రీన్‌లో కొనసాగాయి. నిఫ్టీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, భారత్‌ పెట్రోలియం, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, విప్రో షేర్లు రాణించగా.. ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌ , గ్రాసిమ్‌, ఎన్టీపీసీ, హిందుస్థాన్‌ యునిలివర్‌ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.

ఇది కూడా చదవండి: మగవారికి కిస్మిస్ తో ఫుల్ బెనిఫిట్స్..