గురువారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో అంచనాలను మించి ద్రవ్యోల్బణం నమోదు కావడడంతో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు పై తాజాగా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో మూడు సార్లు వడ్డీ రేట్లు తగ్గింపు చేయబోతుందన్న ఆశలపై ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ నష్టాలకు దారి తీసింది.
Also Read: Pakistan: మాపైనే రైడ్స్ చేస్తారా.? పోలీసులను చితక్కొట్టిన పాక్ ఆర్మీ.. వీడియో వైరల్..
దీనితోపాటు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, మదుపరులు గరిష్ఠాల వద్ద లాభాలు తీసుకోవడం వంటి కారణాలతో స్టాక్ మర్కెట్స్ సూచీలు పతనమయ్యాయి. ఇక నేటి ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లు దగ్గరగా నష్టపోయింది. మరో వైపు నిఫ్టీ కూడా 234 పాయింట్స్ కోల్పోయి 22,519 స్థాయికి చేరింది.
Also Read: TDP: ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు, కందుకూరు టీడీపీలో అసమ్మతి..
ఇక నేటి మార్కెట్ లో సెన్సెక్స్ 30 సూచీలలో టాటామోటార్స్, టీసీఎస్, నెస్లే, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ తప్ప.. మిగితా అన్ని కంపెనీ షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ఇక విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) లు బుధవారం నికరంగా రూ.2,778.17 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DII) లు రూ.163.36 కోట్ల స్టాక్స్ ను కొనుగోలు చేసారు.