మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ రాకెట్లా దూసుకుపోయింది. మార్కెట్ ప్రారంభం దగ్గర ముగింపు వరకు ఓ రేంజ్లో భారీ లాభాల్లో సూచీలు దూసుకెళ్లాయి. భారత్-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం.. ఇన్వెస్టర్లకు భారీగా పంట పండింది. దాదాపు రూ.20 లక్షల కోట్ల సంపద జేబుల్లో పడింది. ఈరోజు కూడా అదే జోరు ఉంటుందని భావించారు. కానీ అందుకు భిన్నంగా బుధవారం మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. అనంతరం నెమ్మదిగా లాభాల్లోకి వచ్చింది.
ప్రస్తుతం సెన్సెక్స్ 34 పాయింట్లు లాభపడి 83,773 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 25,768 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, టాటా స్టీల్, కోల్ ఇండియా, ONGC, NTPC ప్రధాన లాభాలను ఆర్జించగా.. HCL టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, TCS నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఐటీ అత్యంత దెబ్బతింది.