INDvsAUS Test : సచిన్ రికార్డుపై కన్ను..టీమిండియా కాదు ఆసీస్ బ్యాటర్‌కే సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. గురువారం (ఫిబ్రవరి 9) నుంచి జరగబోయే ఈ టెస్టులో కొన్ని రికార్డులు బ్రేకయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు మీదున్న రికార్డుపై ఆస్ట్రేలియా బ్యాటర్ కన్నేశాడు. అతడెవరో కాదు ఆసీస్ సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీల రికార్డుకు స్మిత్ రెండు సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకూ స్మిత్ 8 సెంచరీలు చేశాడు. సచిన్ 9 సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు. ఈ పర్యటనలో భాగంగా స్మిత్ మరో రెండు శతకాలు బాదితే సచిన్ రికార్డు తిరిగరాసినట్లు అవుతుంది. ఒకవేళ ఒక సెంచరీ సాధిస్తే రికీ పాంటింగ్ (8)ను దాటి ఈ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు బాదిన ఆసీస్ క్రికెటర్‌గా ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తాడు. ఇక టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ట్రోఫీలో ఇప్పటివరకు 7 సెంచరీలు బాదాడు. మరో మూడు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డు బ్రేక్ చేసినవాడవుతాడు.’
Also Read: Transgender Pregnant: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి
Also Read
- Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
కుంబ్లే రికార్డుకూ ఎసరు
ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా ఓ రికార్డుపై కన్నేశాడు. ఇండియాపై 100 వికెట్ల రికార్డుకు ఇతడు 6 వికెట్ల దూరంలో ఉన్నాడు. ముత్తయ్య మురళీధరన్ తర్వాత ఇండియాపై ఇలా 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా లియోన్ నిలుస్తాడు. ఇప్పటి వరకూ లియోన్ 22 టెస్టుల్లో 94 వికెట్లు తీసుకున్నాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు (111) తీసుకున్న అనిల్ కుంబ్లే రికార్డుపై కూడా లియోన్ కన్నేశాడు. టీమిండియా స్పిన్నర్ అశ్విన్‌ను కూడా ఇదే రికార్డు ఊరిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రోఫీలో 89 వికెట్లతో కొనసాగుతున్నాడు అశ్విన్. ఇక టెస్టుల్లో 450 వికెట్ల మైలురాయికి అశ్విన్ కేవలం వికెట్ దూరంలో ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న బౌలర్‌గా అశ్విన్ నిలుస్తాడు.
Also Read: Bollywood: ఆమిర్ రికార్డుని బద్దలుకొట్టిన షారుఖ్…
తాజావార్తలు
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!