NTV Telugu Site icon

Kerala: దారుణం.. 8 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా సవతి తండ్రి అత్యాచారం

Kerala

Kerala

Kerala: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తాజాగా.. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో గత రెండేళ్లుగా 8 ఏళ్ల బాలికపై నిరంతర అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. బాలికపై ఆమె సవతి తండ్రి, అతని సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 32, 30 ఏళ్ల నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: Israel-Hamas War: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులు.. భూతల దాడికి అంతా సిద్ధం..

ఉత్తర కేరళలోని ఒక జిల్లాలో 8 ఏళ్ల బాలికపై ఆమె సవతి తండ్రి, అతని సోదరుడు గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై గురువారం పోలీసులు వివరాలను వెల్లడించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం నాడు 32, 30 ఏళ్ల నిందితులను అరెస్టు చేశారు. అనంతరం అతడిని కోర్టు ముందు హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన చిత్తరికల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. చిన్నారితో ఆ వ్యక్తి ప్రవర్తనను ఓ మహిళ గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దీని వెనుక గల కారణాలపై మహిళ బాలికను విచారించింది. ఈ భయంకరమైన సంఘటన గురించి తెలుసుకున్న ఆమె వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడే ముందు మద్యం తాగించిన కేసు కూడా ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.