NTV Telugu Site icon

Election Counting: రేపే నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..

Election Counting

Election Counting

రేపు భాతర దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందు కోసం అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెలలో జరిగిన తెలంగాణ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. అయితే, మిజోరం మినహా నాలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రానికి ఓట్ల లెక్కింపు పూర్తి అయిపోతుంది. అయితే, తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తైన తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. రేపు ఉదయం 10.30 గంటల కల్లా ఎవరు ఆధిక్యంలో ఉన్నారో అనే వివరాలు వెల్లడవుతాయి. మరొ నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలను దేశంలోని అన్ని పార్టీలు సెమీఫైనల్స్ గా చూస్తున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఇక, కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో పటిష్ట భద్రత కొనసాగుతుంది.

Read Also: Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఓ రేంజ్‌లో బెట్టింగ్‌.. రూ. 2,500 కోట్ల పైమాటే..!?

అయితే, నవంబర్ 30వ తేదీ నాడు సాయంత్రం తెలంగాణలో పోలింగ్ పూర్తికాగానే ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. తెలంగాణ, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలిపాయి. ఛత్తీస్ గడ్ లో హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని పలు సర్వేలు పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీ వస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇక, మిజోరంలో స్థానిక పార్టీల ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఈ సర్వేల్లో వెల్లడైంది. అయితే, రేపు మిజోరం ప్రజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున అక్కడి రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ తేదీని ఎల్లుండికి ఛేంజ్ చేసింది.

Read Also: Parliament Sessions: నేడు అఖిలపక్షం భేటీ.. పార్లమెంట్ లో పలు బిల్లుల ఆమోదానికి కసరత్తు..

ఛత్తీస్‌గఢ్ లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 7, 17 తేదీల్లో పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 46 సీట్లలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది.. అలాగే, మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఇక్కడ 116 స్థానాలు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే, రాజస్థాన్ లో 199 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ జరిగింది. ఇక్కడ 101 స్థానాల్లో విజయం సాధించిన పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకోనుంది. మరో వైపు తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరగ్గా.. ఇక్కడ 60 స్థానాల్లో గెలిచిన పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకోనుంది.