Telangana : తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ సిబ్బంది అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించింది. ఎన్నికలకు కావాల్సిన అన్ని రకాల సామగ్రిని రెడీ చేసుకోవాలని చెప్పింది. ఇదే క్రమంలో తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల సంఖ్యను నిర్ణయించింది. జడ్పీపీలు – 31, జడ్పీటీసీలు – 566, ఎంపీపీలు – 566, ఎంపీటీసీ స్థానాలు – 5773 గా తేల్చింది. వీటి ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ సిబ్బంది అన్ని రకాలుగా సామగ్రిని రెడీ చేసుకోవాలని సూచించింది. ఎంపీటీసీల సంఖ్యను కుదించింది. ఇంతకు ముందు కంటే 44 స్థానాలను తగ్గిస్తూ 5773 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని.
Read Also : CM Revanth Reddy : బనకచర్ల కడుతామని ఏపీ చెప్పలేదు.. మీటింగ్ పై సీఎం రేవంత్
ఇందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 353, అత్యల్పంగా ములుగు జిల్లాల్లో 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఆగస్టులో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి పోటీ రసవత్తరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి స్థానిక ఎన్నికల్లో త్రిముఖ పోటీ బలంగా కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతోంది. అటు బీజేపీ కూడా బలంగా పోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది.
Read Also : Seethakka : బీసీ రిజర్వేషన్లు బీజేపీకి ఇష్టం లేదు.. సీతక్క కామెంట్స్
