K.Vishwanath: విశ్వనాథ్ చిత్రాలతో ప్రతిభ చూపిన స్టార్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K.Vishwanath: యాక్షన్ హీరోగా సాగుతున్న కృష్ణను నటునిగా తీర్చిదిద్దింది విశ్వనాథ్ అనే చెప్పాలి. అంతకు ముందు బాపు దర్శకత్వంలో కృష్ణ ‘సాక్షి’ వంటి సినిమాలో నటునిగా మార్కులు సంపాదించినా, కృష్ణను వైవిధ్యంగా చూపించింది విశ్వనాథే! కృష్ణ కెరీర్ లో నెగటివ్ షేడ్స్ తో నటించిన ఏకైక చిత్రం విశ్వనాథ్ రూపొందించిన ‘ప్రైవేటు మాష్టారు’. తరువాత ‘ఉండమ్మా బొట్టు పెడతా’లోనూ కృష్ణ తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రలో కనిపించారు. ఇక కృష్ణను విలక్షణమైన పాత్రలో ‘నేరము-శిక్ష’లో తీర్చిదిద్దారు విశ్వనాథ్.
ఆ రోజుల్లో విశ్వనాథ్ కథలకు తగ్గ హీరోగా నిలచింది శోభన్ బాబు అనే చెప్పాలి. అలాగే విశ్వనాథ్ చిత్రాలతోనే శోభన్ బాబు సైతం వైవిధ్యం ప్రదర్శించారు. తన ‘ప్రేవేటు మాష్టారు’లో చిన్నపాత్రలో శోభన్ ను నటింప చేసిన విశ్వనాథ్, తరువాత ‘నిండు హృదయాలు’లో యన్టీఆర్ తమ్ముని పాత్రలో నటించేలా చేశారు. ఆ పై శోభన్ బాబు హీరోగా ‘చెల్లెలి కాపురం’ తెరకెక్కించారు. ఈ సినిమాలో శోభన్ డీ గ్లామర్ రోల్ లో కనిపించారు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఆ తరువాత విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు “కాలం మారింది, శారద, జీవనజ్యోతి, ప్రేమబంధం, జీవితనౌక, కాలాంతకులు” వంటి చిత్రాలలో హీరోగా నటించారు. వీటిలో ‘జీవనజ్యోతి’ బిగ్ హిట్ గానిలచి, పలు అవార్డులూ రివార్డులూ కూడా సొంతం చేసుకుంది. చిత్రమేమిటంటే, ఆ రోజల్లో శోభన్ ను అందరూ క్లాస్ హీరో అనేవారు. ఇక విశ్వనాథ్ కళకే విలువ ఇస్తూ సాగారు. అలాంటి వీరిద్దరి కలయికలో ‘కాలాంతకులు’ చిత్రం మాస్ మసాలాలతో రూపొందింది. ఇందులోని ఫైట్స్ ను కె.యస్.ఆర్.దాస్ రూపొందించారు. అలాగే కృష్ణంరాజు హీరోగా విశ్వనాథ్ ‘అల్లుడు పట్టిన భరతం’ అనే మాస్ మూవీ తెరకెక్కించారు. ఇందులో రెబల్ స్టార్ తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రలో నటించడం విశేషం!
Also Read
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్‌ను తాకనున్న తొలకరి జల్లు
- AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
K Vishwanath : ఆ ఇద్దరితో విశ్వనాథ్!
అప్పటి దాకా చిన్నచిన్న పాత్రలతోసాగుతున్న చంద్రమోహన్ కు కె.విశ్వనాథ్ చిత్రాలే హీరోగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి. “ఓ సీత కథ, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, శంకరాభరణం, శుభోదయం” వంటి చిత్రాలలో చంద్రమోహన్ నాయక పాత్రల్లో కనిపించారు. ఫైట్స్ డాన్సులతో రాణిస్తున్న చిరంజీవి, నటునిగా పేరు సంపాదించాలని తపించి మరీ కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ‘శుభలేఖ’లో నటించారు. ఈ సినిమాతోనే నటునిగా చిరంజీవి మంచి మార్కులు సంపాదించారు. ఆ తరువాత చిరంజీవి మెగాస్టార్ గా నిలచినా, విశ్వనాథ్ ఆయనతో రూపొందించిన “స్వయంకృషి, ఆపద్బాంధవుడు” చిత్రాలతోనే ఉత్తమనటునిగా నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ హీరోగా అడుగు పెట్టిన తొలి సంవత్సరంలోనే విశ్వనాథ్ రూపొందించిన ‘జననీజన్మభూమి’లో నటించారు. అలాగే తన తొలి రోజుల్లో వెంకటేశ్ విశ్వనాథుని ‘స్వర్ణకమలం’లో నటించి నటునిగా మంచిమార్కులు సంపాదించారు. ఆ పై విశ్వనాథ్ దర్శకత్వంలో వెంకటేశ్ ‘చిన్నబ్బాయ్’లోనూ నటించారు.
యాంగ్రీ యంగ్ మేన్ గా తరువాత పేరు సంపాదించిన రాజశేఖర్ విశ్వనాథ్ దర్శకత్వంలో ‘శ్రుతిలయలు’లో నటించి ఆకట్టుకున్నారు. తమిళనాట స్టార్ హీరోగా సాగుతున్న కమల్ హాసన్ విశ్వనాథుని దర్శకత్వంలో నటించిన “సాగరసంగమం, స్వాతిముత్యం” చిత్రాలతోనే తెలుగువారి మదిలో మరింత విశేషస్థానం సంపాదించారు. కమల్, విశ్వనాథ్ దర్శకత్వంలో ‘శుభసంకల్పం’లోనూ నటించారు.
తాజావార్తలు
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్‌ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?