NTV Telugu Site icon

World Cup 2023: ప్రపంచకప్‌లో స్టార్ స్పోర్ట్స్ కొత్త రికార్డు..

Star Sports

Star Sports

వన్డే వరల్డ్ కప్ 2023 ఇండియాలో జరుగుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఉత్సాహం నెలకొంది. ప్రతీ మ్యాచ్ ను క్రికెట్ స్టేడియంకు వెళ్లి ఆతిథ్య జట్టుకే కాకుండా.. ఇతర జట్లను ప్రోత్సహిస్తున్నారు. ఇక స్టేడియంకు వెళ్లని వారైతే టీవీల్లో కానీ, ఫోన్లలో కానీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కు డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో అత్యధిక వ్యూయర్ షిప్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ రేటింగ్ పెరిగింది. ఏం చక్కా ఇంట్లో కూర్చుని వరల్డ్ కప్ మ్యాచ్ లను తిలకిస్తున్నారు.

Read Also: Ambajipeta Marriage Band : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

అయితే ఇప్పటివరకు జరిగిన మొదటి మ్యాచ్ లను టీవీలో 36.42 కోట్ల మంది వీక్షించారని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. ఇది వన్డే ప్రపంచకప్‌లో కొత్త రికార్డు అని ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఛానెల్ ను వీక్షించే వారి సంఖ్య 43 శాతం పెరిగిందని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే.. అభిమానులు గతంలో కంటే ఈసారి టీవీకి ఎక్కువగా అతుక్కుపోయారు. ఇది మన ఆటకు ఉన్న ఆదరణకు, భారత క్రికెట్ అభిమానుల శక్తికి నిదర్శనం అని జై షా ట్విట్టర్ లో తెలిపారు.

Read Also: Qatar: 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఉరిశిక్ష.. ప్లాన్ ప్రకారమే ఇరికించిన పాకిస్తాన్, ఖతార్.?

టోర్నమెంట్ అక్టోబర్ 5 నుండి ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్ ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగింది. టోర్నీలోని 18వ లీగ్ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగింది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడగా.. అన్నింటిలోనూ విజయం సాధించింది. ఇప్పటి వరకు టీమిండియా పరుగుల ఛేజింగ్‌లోనే గెలిచింది.

Show comments