NTV Telugu Site icon

BRO : ఏంటి ‘బ్రో’ ఇది… ఐటమ్ సాంగ్ కు ఆ స్టార్ హీరోయినా ?

Bro

Bro

BRO : రోజుకో కొత్త అప్ డేట్ ఇస్తూ మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నారు ‘బ్రో’ చిత్రయూనిట్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రాబోతుంది. సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మెగా మల్టీస్టారర్గా రూపొందుతోన్న ‘బ్రో’ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇది మొదలైన నెల రోజులకే పవన్ కల్యాణ్ కు సంబంధించిన టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి మిగిలిన నటీనటులపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఇప్పుడు జరుగుతోన్న షెడ్యూల్లో సాయి తేజ్ సీన్లను తెరకెక్కిస్తున్నారు.

Read Also:Naresh-Pavitra Lokesh : నాకు మరో అమ్మ దొరికింది..ఉద్వేగభరితమైన నరేష్

ఇదిలా ఉంటే ఈ మూవీలో అదిరిపోయే ఐటెం సాంగ్ పెట్టబోతున్నారని ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది. హైదరాబాద్ నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకమైన పబ్ సెట్ కూడా నిర్మిస్తున్నారట. త్వరలోనే జరగనున్న ఈ పాట షూట్లో పవన్ పాల్గొననున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక ఈ మూవీలో స్పెషల్ సాంగ్లో ఏ హీరోయిన్ నర్తించబోతుందన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పాట కోసం శృతి హాసన్ లేదా దిశా పటానీలను తీసుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరిలో ఎవరి డేట్స్ కుదిరితే వాళ్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ పాటను ఓ రేంజ్లో ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. జీ సంస్థతో కలిసి నిర్మిస్తోంది.

Read Also:What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Show comments