NTV Telugu Site icon

SS Rajamouli: పెను వివాదం.. వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి

Rajamouli Srinivasarao

Rajamouli Srinivasarao

అనూహ్యంగా రాజమౌళి ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందులో నిజం ఎంత ఉందో లేదో తెలియదు కానీ శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి రాజమౌళి, తాను ఒకే మహిళను ప్రేమించామని ఇప్పుడు ఆ విషయం బయట పడుతుందని తనమీద ఒత్తిడి చేస్తున్నాడు అంటూ ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. అతను రాజమౌళి స్నేహితుడే కానీ అతను మాట్లాడుతున్న మాటలు ఎంతవరకు నిజమో తెలియదని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు. ఇదిలా ఉండగా తాజాగా రాజమౌళి ఒక వీడియో రిలీజ్ చేశారు..

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

ఇంత పెద్ద వివాదం జరగడంతో ఆయన దీని మీద స్పందించారేమో అని అందరూ అనుకుంటే అందుకు భిన్నంగా ఆయన కీరవాణి లైవ్ కన్సర్ట్ గురించి వీడియో రిలీజ్ చేశారు. మార్చి 22వ తేదీన జరగబోతున్న ఈ లైవ్ ఈవెంట్ గురించి మాట్లాడుతూ కీరవాణి తన సినిమాలోని పాటలతో పాటు ఆయన కంపోజ్ చేసిన ఎన్నో వేల పాటలను మీ ముందుకు తీసుకొస్తున్నారని చెబుతూ రాజమౌళి చెప్పుకొచ్చారు. కీరవాణి లైవ్ లో పర్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నానని అంతేకాక ఆయన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడే కంపోజ్ చేయాలని ప్రేక్షకులను అలరించాలని ఆయన కోరాడు.