SS Rajamouli Dance: స్టేజ్‌పై స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి దంపతులు.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli Dance Video Goes Viral: టాలీవుడ్ దర్శకధీరుడు ‘ఎస్ఎస్ రాజమౌళి’ స్టేజ్‌పై చాలా తక్కువగా మాట్లాడుతాడన్న విషయం తెలిసిందే. తన సొంత సినిమా ప్రమోషన్లు, తెలిసిన వారి సినిమా ఈవెంట్లకు మాత్రమే హాజరయ్యే రాజమౌళి.. తన స్టైల్లో మాట్లాడి ముగించేస్తారు. అలాంటి రాజమౌళి డాన్స్ చేసిన దాఖలు ఇప్పటివరకు లేవు. అయితే తాజాగా రాజమౌళి స్టేజ్‌పై స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా ఎస్ఎస్ రాజమౌళి ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు తన భార్య రమతో కలిసి వెళ్లారు. ఆ ఫంక్షన్లో ప్రేమికుడు సినిమాలోని ‘అందమైన ప్రేమరాణి ఉత్తరాలకే…’ అనే పాటకు రాజమౌళి దంపతులు డ్యాన్స్ చేశారు. రాజమౌళి, రమ స్టేజ్‌పై ఎంతో హుషారుగా డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా జక్కన్న స్టెప్పులేసిన తీరు చూస్తే.. ఆశ్చర్యం కలగక మానదు. రాజమౌళి, రమ డాన్స్ చేస్తుంటే.. అందరూ ఈలలు, కేకలు వేశారు. ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
Also Read
- Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
- CM Vijay: సింహాసనం విజయ్‌ది.. వ్యూహం కాంగ్రెస్‌ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..!
- Pawan Kalyan: అమిత్ షాతో అలాంటి విషయాలు ఎందుకు మాట్లాడతాను
- Nifty 50: రికవరీ దిశలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 25,000 మార్క్‌ను దాటుతుందా..?
Also Read: Rishabh Pant Six: దీనికోసమే ఏడాదిన్నర వేచి చూశా: రిషబ్ పంత్
ఆర్ఆర్ఆర్తో భారీ హిట్ అందుకున్న ఎస్ఎస్ రాజమౌళి.. కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా (SSMB29) చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్టు పనుల్లో జక్కన్న మునిగిపోయారు. ఇటీవలే స్క్రిప్ట్ పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు ఈ మూవీ కోసం లుక్ మార్చుకునే పనిలో ఉన్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మూవీ సెట్స్ మీదికి వెళ్లే అవకాశం ఉంది.
Director #SSRajamouli and his wife #RamaRajamouli groove to the beats of Beautiful melody, setting the party on fire at a family function 🤩 pic.twitter.com/qlA3UYBpz2
— BhaRGV (@BhargavChaganti) April 1, 2024
తాజావార్తలు
-
Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
-
Oppo Pad 6: డైమెన్సిటీ 9500s, 10420mAh బ్యాటరీతో.. ఒప్పో ప్యాడ్ 6 విడుదల
-
Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
-
CM Vijay: సింహాసనం విజయ్‌ది.. వ్యూహం కాంగ్రెస్‌ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..!
-
Ranveer Singh: కెరీర్ పీక్స్‌లో ఉండగానే షాక్.. ‘ధురంధర్’ హీరోపై బ్యాన్.. అసలు మ్యాటర్ ఇదే!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?