శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.. రోజు రోజుకు కలెక్షన్స్ భారీ పెరుగుతున్నాయంటే సినిమా అంత బాగుందని అర్థమవుతుంది. 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంతకాలానికి తెలుగు ప్రేక్షకులకు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల జనాలను కడుపుబ్బా నవ్వించేసారు..
శ్రీవిష్ణు నటించిన సామజవరగమన సినిమా విజయంతో మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ అంశాలన్నీ పోస్ట్-రిలీజ్ టాక్ కూడా సినిమాకి మంచి బిజినెస్ చేయడంలో వల్ల కలెక్షన్స్ పెరుగుతున్నాయి.. ‘ఓం భీమ్ బుష్’ మంచి ఓపెనింగ్ తో దూసుకుపోతుంది.. ఆరు రోజులకు 25 కోట్లకు పైగా వసూల్ చేసిందంటే మామూలు విషయం కాదు..
ఇక ఈ సినిమాకు ఆరు రోజులలో ప్రపంచవ్యాప్తంగా రూ. 25.20 కోట్లు వసూలు చేసింది. శ్రీవిష్ణు కేరీర్ లో హైయేస్ట్ గ్రాస్ గా నిలిలుస్తుంది.. ఓం భీమ్ బుష్ USAలో కూడా సూపర్ సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది.. మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది . శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించి, వి సెల్యులాయిడ్ మరియు సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం వేసవి సెలవులతో లాంగ్ రన్లో కొనసాగుతుంది.. అలాగే శ్రీవిష్ణుకి కేరీర్ లో అతిపెద్ద రికార్డు అందుకున్న సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని తెలుస్తుంది.