Site icon NTV Telugu

Tirumala: ఇవాళ్టి నుంచి తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు

Tirumala

Tirumala

తిరుమలలో శ్రీ శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వ‌ర‌కు జరుగనున్నాయి. అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలకు నిన్న (శ‌నివారం) సాయంత్రం శాస్త్రోక్తంగా టీటీడీ అర్చకులు అంకురార్పణ చేపట్టారు. అంకూరార్పణ సందర్భంగా సేనాధిపతి విష్వక్సేనులవారు ఆలయ మాడ మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మహ్సవాల ఏర్పాట్లను పరీశీలించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారిని దర్శించడానికి రోజూ లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.

Read Also: Operation Ajay: 197 మంది భారతీయులతో ఢిల్లీ ల్యాండ్ అయిన మూడో విమానం

అయితే, శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీవారి దర్శనాన్ని కల్పించడంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అందుకే సర్వదర్శన టోకెన్ల సంఖ్యను కూడా పెంచారు. కాలినడకన వచ్చే వారు నేరుగా శ్రీవారి దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. లడ్డూ ప్రసాదాలను సైతం సిద్ధం చేశారు. ప్రతిరోజూ లక్షకు పైగా లడ్లను టీటీడీ విక్రయించనుంది.

Read Also: Gold Price Today: మగువలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! తులంపై ఏకంగా రూ. 1530

బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజనం వేదికపై ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు తెల్లవారు జామున 5 నుంచి 5:45 నిమిషాల వరకు వేద విద్యార్థులు చ‌తుర్వేదాల‌తో వేద‌ఘోష జరుపనున్నారు. 5:45 నుంచి 6:45 గంటల వరకు భారత్ లోని ప్రముఖ పండితుల‌తో వేద విజ్ఞానంపై స‌ద‌స్సు నిర్వహిస్తారు.. ఈ సారి బ్రహ్మోత్సవాల ప్రత్యేకతగా వేదఘోష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.

Exit mobile version