Site icon NTV Telugu

Tirumala: వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు.. గరుడ వాహనంపై మలయప్ప స్వామి దర్శనం

Srivari Garuda Seva

Srivari Garuda Seva

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు గరుడోత్సవం నేత్ర పర్వంగా మొదలైంది. వైభవంగా శ్రీవారికి గరుడవాహన సేవ మొదలుకాగా.. గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. గోవిందనామాలతో తిరుమలగిరులు మార్మోగుతున్నాయి.

Also Read: Botsa Satyanarayana : 8 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం.

నిత్యం మూలమూర్తి ఆభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీకాసుల హారాలను గరుడసేవలో స్వామివారికి అలంకరించారు. ఏడాది మొత్తంలో గరుడోత్సవం రోజు మాత్రమే ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వస్తాయన్న విషయం విదితమే. మరోవైపు గ్యాలరీలలో రెండు లక్షల భక్తులు చేరినట్లు సమాచారం. గరుడవాహన దర్శనం కోసం భక్తులు పోటీ పడుతున్నారు. గరుడవాహన దర్శనం కోసం రింగ్ రోడ్డులో భక్త సంద్రం వేచి ఉన్నట్లు తెలుస్తోంది.

జగన్నాటక సూత్రదారియై తిరువీధుల్లో ఊరేగే మలయప్ప స్వామి భక్తులందరికీ దివ్యమంగళ రూపం దర్శనమిచ్చారు. జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తకోటి నమ్మకం. అందుకే గరుడ వాహనంపై విహరించే స్వామి వారిని దర్శించుకునేందుకు.. లక్షలాది మంది ఏడుకొండలు ఎక్కి శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు. ఇవాళ్టి గరుడ సేవకు కొన్ని లక్షల మంది విచ్చేసినట్లుగా తెలుస్తోంది.

 

Exit mobile version