Srisailam Temple Trust: టీటీడీ తరహాలో శ్రీశైలానికి స్వయంప్రతిపత్తి కల్పించాలి.. ట్రస్ట్ బోర్డ్ తీర్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Temple Trust: శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో కీలక తీర్మానం చేశారు.. శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 23వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు 4 గంటలపాటు కొనసాగింది. అనంతరం మొత్తం 50 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 49 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 వాయిదా వేశారు.. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించామని వెల్లడించారు ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి.. అలాగే శ్రీశైలంలో భక్తులు, స్థానికుల కోసం సుమారు 19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కర్నూలు నగరంలోని దేవస్థానం సమాచార కేంద్రం వద్ద కళ్యాణ మండపం, వాణిజ్య సముదాయానికి రూ.8 కోట్ల 60 లక్షలకు ఆమోదించారు. వీటితోపాటు సున్నిపెంటలో నిర్మిస్తున్న సిబ్బంది వసతిగృహాలకు నీటి సరఫరాకి ఏర్పాటుకు అంచనా వ్యయం రూ. 15 కోట్లు ఆమోదించారు. క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా సూపరింటెండెంట్ ఇంజనీరు పోస్ట్ ఏర్పాటుకు దేవాదాయశాఖకు ప్రతిపాదనలకు తీర్మానించారు. అలానే దేవస్థానంలో క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించామని ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మీడియాకు తెలిపారు.
Read Also: TDP-Janasena: 28న టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్
Also Read
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!