Srinu Vaitla : దర్శకుడిగ శ్రీనువైట్ల ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. స్టార్ స్టేటస్ అనుభవించారు. ఎంతో మంది స్టార్ హీరోలను డైరెక్ట్ చేశారు. దర్శకుడిగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం శ్రీను వైట్ల సొంతం. అయితే మహేశ్ నటించిన `ఆగడు` దగ్గర నుంచి ఆయన కెరీర్ ఒక్కసారిగా దిగజారిపోయింది. అప్పటి వరకు వరుస విజయాలతో దూసుకుపోయిన వైట్ల అప్పటి నుంచి ఆయన జోరు తగ్గిపోయింది. తను దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ఫ్లాప్ లు అవ్వడం మొదలయ్యాయి. అయినా శ్రీను వైట్ల బ్రాండ్ ఇమేజ్ తో అవకాశాలు అందుకోగలుగుతున్నారు.
ఇటీవలే గోపీచంద్ తో తీసిన `విశ్వం` సినిమాతో కంబ్యాక్ అవ్వాలని గట్టిగానే ప్రయత్నం చేశారు శ్రీను వైట్ల. తన మార్క్ ని చూపించే ప్రయత్నం చేశారు. కానీ అది నిరాశనే మిగిల్చింది. అయినా తగ్గేదేలే అంటూ ఆయన కొత్త సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఓ కొత్త ఐడియాతో సినీ ప్రేక్షకుల ముందుకొస్తాననన్న ధీమాని వ్యక్తం చేశారు. ఓ చిట్ చాట్లో తను నెక్స్ట్ చేయబోయే సినిమా గురించిన విషయాలు పంచుకున్నారు.
Read Also:Virat Kohli Century: ఒక్క సెంచరీ.. సచిన్, బ్రాడ్‌మన్ రికార్డులు బద్దలు!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..` ఇకపై నేను కథల్లో కొత్తదనం ..ఏదైనా వైవిధ్యం ఉంటేనే వాటితో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా ప్రస్తుతం ఓ కొత్త కుర్రాడు ఇచ్చిన కొత్త రకమైన కథతో పూర్తి స్థాయిలో వినోదాత్మక చిత్రం తీయాలన్న ఆలోచనలో ఉన్నాం. అది కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం బలంగా ఉంది. కథ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. తర్వలోనే సినిమాలో నటించే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను వెల్లడిస్తాం` అన్నారు.
అయితే ఇందులో హీరో ఎవరు? అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం స్టార్ హీరోలంతా బిజీగా ఉన్నారు. టైర్-2 హీరోలు కూడా అంతే బిజీగా సినిమాలను చేస్తున్నారు. పైగా శ్రీను వైట్ల ప్లాప్ ల్లో ఉన్నారు? అవకాశం ఇచ్చే ముందు అతడి ట్రాక్ కూడా చూస్తారు హీరోలు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీనువైట్ల ఏ హీరోని రంగంలోకి దించుతారో చూడాలి.
Read Also:Tiger Search Operation: కొమురంభీం జిల్లా సిర్పూర్ అటవీ ప్రాంతంలో పులి కోసం వేట..