Srinivas Goud : ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్టా.? ఢిల్లీకి మేం రాకూడదా.?
- ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం కోసం ఢిల్లీకి వచ్చామన్న శ్రీనివాస్ గౌడ్
- కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు నోటికొచ్చింది ప్రసారం చేయడం తగదని వ్యాఖ్య
- ఊహాజనితంగా కథనాలు రాయడం జర్నలిజానికి మంచిది కాదని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్టా? ఢిల్లీకి మేం రాకూడదా? అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం కోసం ఢిల్లీకి వచ్చామని, కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు నోటికొచ్చింది ప్రసారం చేయడం తగదని ఆయన అన్నారు. ఊహాజనితంగా కథనాలు రాయడం జర్నలిజానికి మంచిది కాదని, ఇలాంటి కథనాలు రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది ఎవరో కూడా అందరికీ తెలుసు అన్నారు. 2 ఎంపీలతో బీజేపీ ప్రస్థానం మొదలైంది. అలాగని ఆ పార్టీ అక్కడితో ఆగిపోయిందా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు మా పార్టీ కూడా అంతే. కొందరు డబ్బుకు ఆశపడి వెళ్లారు. అంతమాత్రాన పార్టీ పని అయిపోయినట్టు కాదని, ప్రజలు కూడా రైతు బంధు సహా అనేక పథకాలు ఎక్కువ ఇస్తామని చెబితే నమ్మారు. ఓటు వేశారన్నారు. ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు. కొన్నేళ్ళ తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటారని, బీఆర్ఎస్ బలహీనపడలేదు. మేం బలంగానే ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు 39 సీట్లు ఇవ్వడం అంటే బలహీనమైనట్టు కాదని, నిన్నగాక మొన్న మహబూబ్‌నగర్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ గెలుచుకున్నామన్నారు శ్రీనివాస్ గౌడ్.
Waqf Bill: “1500 ఏళ్ల దేవాలయం వక్ఫ్ ఆస్తి ఎలా అవుతుంది..? ” ఉదాహరణలతో విరుచుకుపడిన బీజేపీ..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అంతేకాకుండా..’ఒక జాతీయ పార్టీ ఎదగాలని కోరుకోవడం తప్పేం కాదు కదా?. కానీ ప్రజలు ఆ జాతీయ పార్టీ పక్క రాష్ట్రంలో ఏం చేసిందో చూస్తారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిగా మోదీయా.. రాహుల్ గాంధీయా అన్నదే చూశారు. అందుకే ప్రాంతీయ పార్టీలకు అవకాశం దక్కలేదు. మేము అటో ఇటో ఉంటే మాగ్కూడా 10-15 సీట్లు వచ్చి ఉండేవి. మేం ఈ రెండు కూటముల్లో లేకపోవడం వల్లనే ఫలితాలు ఇలా వచ్చాయి. ఎన్నికలప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఉండదు. ఏ కూటమిలో చేరే ఆలోచన లేదు. ఇక విలీనం అన్న ప్రస్తావన అస్సలే లేదు. అది పూర్తిగా దుష్ప్రచారం. ప్రజాగ్రహం ఎదురైతే బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో చూశాం. ఎక్కడైనా అలాగే జరుగుతుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీపై కుట్రలు జరిగాయి. పార్టీ పని అయిపోయింది అంటూ దుష్ప్రచారం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొందరి పాత బుద్ధి మారలేదు. ఇప్పుడు బీజేపీలో విలీనం అంటూ అత్యుత్సాహంతో కథనాలు రాస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం.
Serial Killer: చెరుకు తోటల్లో చీరతో ఉరేసి..యూపీలో సీరియర్ కిల్లర్..? 9 మంది మహిళల హత్య..
భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తుంది. ప్రజలపక్షాన కొట్లాడతది. తెలంగాణ రాక ముందు రాష్ట్ర పరిస్థితి, ఏర్పడ్డ తర్వాత పరిస్థితిని పోల్చి చూడండి. వ్యవసాయం, విద్యుత్తు, ఆర్థిక స్థితిగతులు, తెలంగాణ అస్తిత్వం ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుకోండి. తెలంగాణ పేరు ఉచ్ఛరించడానికి కూడా భయపడేవారు. సచివాలయంలో భాష యాస మార్చుకుని మాట్లాడిన సందర్భాలున్నాయి. తెలంగాణ పేరు చెబితే గతంలో ఢిల్లీ ఏపీ భవన్లో గదులు కూడా ఇవ్వకపోయేవారు.’ అని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!