Sreemukhi: నక్క తోక తొక్కింది..పాన్ ఇండియా సినిమాలోకి శ్రీముఖి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చాలా అందంగా ఉండటమే కాదు.. చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. బుల్లితెరపై పలు షోలల్లో యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి..
బుల్లితెర పై ఒక షోలో శ్రీముఖి కనిపించిందంటే సందడి మాములుగా ఉండదు.. ప్రతి పండక్కి శ్రీముఖి షో ఖచ్చితంగా ఉంటుంది.. యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ అమ్మడుకు ఎక్కువనే చెప్పాలి.. గతంలో శ్రీముఖి పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది. అయితే హీరోయిన్గా ట్రై చేసింది.. కానీ ఎందుకో సక్సెస్ అవ్వలేక పోయింది.. దాంతో మళ్లీ బుల్లితెరనే నమ్ముకుంది. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది..
Also Read
శ్రీముఖి ఓ పాన్ ఇండియా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతుంది.. ఈ సినిమాలో శ్రీముఖి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి సిస్టర్ పాత్రలో శ్రీముఖి కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ సినిమాలో నటిస్తే మాత్రం శ్రీముఖి రేంజ్ ఇంకా పెరుగుతుందని ఆమే ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. ఈ విషయం పై త్వరలోనే అధికారక ప్రకటన రాబోతుందని సమాచారం..
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!