Sri Sri: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్దే కెమిస్ట్రీ అదిరిపోయిందిగా.. ‘శ్రీ శ్రీ’ నుంచి ‘బొమ్మ బొమ్మ’ సాంగ్ రిలీజ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Sri First Song ‘Bomma Bomma’: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న పాన్-ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘శ్రీ శ్రీ’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ (SLV) సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సంస్థకు ఇది 10వ చిత్రం కాగా.. ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, వర్కింగ్ స్టిల్స్‌కు మంచి స్పందన లభించగా.. తాజాగా చిత్రబృందం మొదటి పాటగా ‘బొమ్మ బొమ్మ’ను విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
‘బొమ్మ బొమ్మ’ పాట ప్రేమలోని తొలి అనుభూతిని ఎంతో అందంగా తెరపై ఆవిష్కరించింది. రైల్వే స్టేషన్లో ఓ బెంచ్‌పై కూర్చున్న దుల్కర్ సల్మాన్, ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన పూజా హెగ్డేను తొలిసారి చూసిన క్షణంలోనే ఆమె ప్రేమలో పడే సన్నివేశాలతో పాట ప్రారంభమవుతుంది. ఈ మెలోడీకి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ తనదైన శైలిలో హృదయాన్ని హత్తుకునే స్వరాలను అందించారు. సింపుల్ అయినా ఆకట్టుకునే ట్యూన్‌కు క్లాసీ ఆర్కెస్ట్రేషన్ జోడించి పాటను మరింత స్పెషల్ గా మార్చారు. అనంత ఈ పాటకు శ్రీరామ్ తన సాహిత్యం అందించగా.. గాయకుడు కపిల్ కపిలన్ తన మృదువైన గాత్రంతో పాటకు మరింత ప్రాణం పోశారు. రామ్ మాస్టర్ కొరియోగ్రఫీ ప్రతి సన్నివేశాన్ని అందంగా తెరకెక్కించాడు.
Also Read
- 8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
- Team India Schedule: జింబాబ్వే సిరీస్ ముగిసింది.. టీమిండియా వాట్ నెక్స్ట్.?
- Justin Greaves: టెస్ట్ చరిత్రలో అరుదైన రికార్డు.. ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు నేలకూల్చిన వెస్టిండీస్ పేసర్.!
- Pavala Shyamala: టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత..!
తాజావార్తలు
-
Sri Sri: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్దే కెమిస్ట్రీ అదిరిపోయిందిగా.. ‘శ్రీ శ్రీ’ నుంచి ‘బొమ్మ బొమ్మ’ సాంగ్ రిలీజ్.!
-
Dhoom 4: ‘ధూమ్ 4’ నుంచి రణబీర్ కపూర్ అవుట్ ?… కొత్త హీరో కోసం యశ్ రాజ్ ఫిల్మ్స్ వేట!
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
Tollywood: టాలీవుడ్లో గాయాల షాక్.. ‘బాబాయ్-అబ్బాయి’ జంటలకు సర్జరీలు, షూటింగ్‌లపై ప్రభావం!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!